Theatres: కోవిడ్ తగ్గుముఖం.. 50శాతం కెపాసిటీతో థియేటర్లు ప్రారంభం

హర్యానా రాష్ట్రంలో కోవిడ్-19కి సంబంధించిన కొన్ని పరిమితులను సడలించింది అక్కడి ప్రభుత్వం.

Theatres: కోవిడ్ తగ్గుముఖం.. 50శాతం కెపాసిటీతో థియేటర్లు ప్రారంభం

Theatres

Theatres: హర్యానా రాష్ట్రంలో కోవిడ్-19కి సంబంధించిన కొన్ని పరిమితులను సడలించింది అక్కడి ప్రభుత్వం. 50శాతం సీట్ల సామర్థ్యంతో అన్ని సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను తెరుచుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. కరోనా వైరస్ మూడో వేవ్ కారణంగా రాష్ట్రంలో అనేక ఆంక్షలు విధించింది హర్యానా ప్రభుత్వం.

హర్యానా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(HSDMA) జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం, “అన్ని సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50శాతం సీట్ల సామర్థ్యంతో తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు సామాజిక దూరం, సాధారణ పరిశుభ్రత, మాస్క్‌లు ధరించడం COVID-19 తగిన ప్రవర్తనా నిబంధనలను అనుసరించడం చెయ్యాలని ప్రభుత్వం సూచిస్తోంది.

జనవరి 5వ తేదీన HSDMA జారీ చేసిన ఉత్తర్వులలో, సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉత్తర్వుల్లో ఈ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

“ప్రైవేట్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు (10 నుంచి 12 తరగతులకు), పాలిటెక్నిక్‌లు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు, లైబ్రరీలు, ప్రత్యక్ష తరగతుల కోసం శిక్షణా సంస్థలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెరవనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.