Procession On JCB: బుల్డోజర్‌పై నూతన జంట ఊరేగింపు .. చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. వీడియో వైరల్

గుజరాత్ రాష్ట్రం నవ్‌సారి జిల్లా కలియారి గ్రామంలో నూతన జంట జేసీబీపై పెళ్లి ఊరేగింపు జరుపుకున్నారు. కొత్తతరహాలో జరుగుతున్న పెళ్లి ఊరేగింపును చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Procession On JCB: బుల్డోజర్‌పై నూతన జంట ఊరేగింపు .. చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. వీడియో వైరల్

JCB

Procession On JCB: జీవితంలో ప్రతీఒక్కరికి పెండ్లి అనేది ఓ మధురానుభూతి. పెళ్లి వేడుక తమతో పాటు, కుటుంబ సభ్యులకు పది కాలాల పాటు గుర్తుండిపోయేలా జరగాలని ప్రతీఒక్క జంట భావిస్తోంది. దీంతో పెళ్లి మండపానికి వచ్చే క్రమంలో, పెళ్లి అనంతరం వధూవరుడు ఊరేగింపు సమయంలో అందరినీ ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల ఓ వధువు పెళ్లి మండపానికి లారీ నడుపుకుంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజాగా ఓ వరుడు తన కుటుంబ సభ్యులతో కలిసి జేసీబీపై పెళ్లి మండపానికి చేరుకున్నాడు. పెళ్లి అనంతరం తన సతీమణితో కలిసి అదే జేసీబీపై ఊరేగింపు జరుపుకున్నారు. ఈ విచిత్ర ఘటనను చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

 

The bride and groom celebrated a wedding procession on JCB in Kalyari village of Navsari district of Gujarat state.

The bride and groom celebrated a wedding procession on JCB in Kalyari village of Navsari district of Gujarat state.

పెండ్లి వేడుకలో భాగంగా వధువు, వరుడు ఎక్కువగా కార్లు, ఇతరు వాహనాల్లో, గుర్రపు బండ్లపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి వస్తుంటారు. కానీ, గుజరాతీ పెండ్లి కొడుకు వినూత్న ఆలోచన చేశాడు. గుజరాత్ రాష్ట్రం నవ్‌సారి జిల్లా కలియారి గ్రామానికి చెందిన కేయూర్ పటేల్ అనే యువకుడి వివాహం జరుగుతుంది. పెళ్లికొడుకులా ముస్తాబైన కేయూర్ పటేల్ వినూత్నంగా జేసీబీపై ఊరేగింపుగా కల్యాణ మండపానికి వెళ్లాలని భావించాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జేసీబీకి పూలతో అలంకరించాడు. జేసీబీ ముందుభాగంలో ఉండే వోబాక్స్‌లో సోఫాను ఉంచాడు, ఎండ తగలకుండా వోబాక్స్‌పైన పందిరి ఏర్పాటు చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకున్నాడు.

Wedding procession

Wedding procession

పెళ్లితంతు పూర్తికాగానే తన సతీమణితో కలిసి అదే జేసీబీపై ఊరేగింపుగా తన స్వగ్రామానికి బయలుదేరాడు.  బుల్డోజర్‌పై  ఊరేగింపుగా వెళ్తున్న నూతన జంటను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. జేసీబీ ముందు బంధువులు, స్నేహితులు డ్యాన్స్ లు చేస్తూ ముందుకు సాగుతుండగా.. నూతన జంట ఏంచక్కా జేసీబీ వోబాక్స్ లో ఏర్పాటు చేసిన సోఫాపై కూర్చొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు కేయూర్ పటేల్ ఐడియాను మెచ్చుకుంటున్నారు.