Groom Postponed Wedding : ఓటు వేసేందుకు ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్న వరుడు

ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది.

Groom Postponed Wedding : ఓటు వేసేందుకు ఏకంగా పెళ్లినే వాయిదా వేసుకున్న వరుడు

groom postponed wedding

Groom Postponed Wedding : పెళ్లిళ్లు ముహూర్తం సమయానికే జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ముహూర్తం సమయానికి పెళ్లి చేసుకుంటారు. అయితే ఎన్నికల రోజు పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న పలు జంటలు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చి అందరినీ ఆకర్షించాయి. ఓ పెళ్లి కొడుకు ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది.

కొంతమంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోగా.. ముందు ఓటు తర్వాతే పెళ్లి అన్న రీతిలో వధూవరులు అమూల్యమైన ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాష్ట్రంలోని తపి జిల్లాలో ఓ వరుడు ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏకంగా తన పెళ్లి సమయాన్నే మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరించింది. ప్రపుల్ బీ అనే యువకుడి వివాహాన్ని మహారాష్ట్రలో గురువారం ఉదయం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా వరుడు అక్కడికి వెళ్లాల్సివుంది.

Also Read : Bride Dedication: అంగరంగ వైభవంగా ముగిసిన పెళ్లి.. ఓటేశాకే అత్తారింటికి..

కానీ అదే రోజు ఎన్నికల పోలింగ్ ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓటు వేసిన అనంతరం ప్రపుల్ బీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపిచ్చారు. తన పెళ్లి వేడుకను గురువారం ఉదయం జరిపించేలా ముందుగా ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. అయితే పోలింగ్ నేపథ్యంలో వివాహాన్ని సాయంత్రానికి వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.

మరోచోట వధువు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు కొన్ని గంటల ముందు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : #GujaratElections: వివాహం జరగగానే పెళ్లి పందిరి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి జంట

ఇకపోతే కుచ్ జిల్లాలోని భజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 208 పోలింగ్ కేంద్రంలో నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కవిత, వైభవ్ అనే కొత్త పెళ్లి జంట వివాహం ఘనంగా జరిగింది. అయితే అదే రోజు పోలింగ్ ఉండటంతో పెళ్లి జరిగిన వెంటనే కళ్యాణ మండపం నుంచి నేరుగా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు వేశారు.