Three Fighter Jets Crash : రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో యుద్ధ విమానాల ప్రమాద ఘటన.. అంతర్గత విచారణకు ఆదేశించిన భారత వాయుసేన

రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.

Three Fighter Jets Crash : రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో యుద్ధ విమానాల ప్రమాద ఘటన.. అంతర్గత విచారణకు ఆదేశించిన భారత వాయుసేన

Air Force

Three Fighter Jets Crash : రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులు అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ చౌదరిలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. వాయుసేన పైలట్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో ఇవాళ వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలడం కలకలం సృష్టింస్తోంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోని నిర్మానుష్య అటవీప్రాంతంలో మూడు యుద్ధ విమానాలు కూలి పోవడంతో భారత వాయుసేనకు గట్టి దెబ్బ తగిలినట్లైంది. మధ్య ప్రదేశ్ లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్ విమానాలు ఇవాళ కూలిపోయాయి. మధ్యప్రదేశ్ లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు కుప్ప కూలాయి. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సాంకేతిక లోపం కారణంతోనే కూలాయా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సివుంది.

Plane Crashed : రాజస్థాన్ లో కూలిన చార్టెడ్ విమానం

రాజస్థాన్ తోపాటు మధ్యప్రదేశ్ లో ఇవాళ మూడు విమానాలు కుప్పకూలాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో చార్టెడ్ విమానం కుప్ప కూలిపోయింది. సాంకేతి లోపం కారణంగానే చార్టెడ్ విమానం కుప్ప కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటినా తరలి వచ్చారు. విమానం కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు, పునరావాస పనులు చేపట్టామని భరత్ పూర్ జిల్లా కలెక్టర్ అనూప్ రంజన్ తెలిపారు.

మరోవైపు ఇవాళ మధ్యప్రదేశ్ లో కూడా రెండు యుద్ధ విమానాలు కూలి పోవడం కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని మోరెనా సమీపంలో సుఖోయో-30, మిరాజ్ అనే రెండు యుద్ధ విమానాలు కుప్ప కూలాయి. భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలు సాంకేతిక కారణంతోనే కూలాయి? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయన్నది ఇంకా తెలియాల్సివుంది. మధ్యప్రదేశ్ లోని యుద్ధ విమానాలు కూలిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి.

Sukhoi, Mirage Aircraft Crash : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్ యుద్ధ విమానాలు

సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఎయిర్ బేస్ నుంచి శిక్షణ కోసం బయల్దేరినట్లుగా తెలిసింది. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సుఖోయ్-30 విమానం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారని, వారికి స్పల్ప గాయాలయ్యాని తెలిపారు.