Indian Women’s Hockey : ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళల హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ కు వెళ్లింది. పూల్..ఏ మ్యాచ్ లో బ్రిటన్ చేతిలో ఐర్లాండ్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ ఓటమితో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది.

Indian Women’s Hockey : ఒలింపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ కు చేరిన భారత మహిళల హాకీ జట్టు

Women's Hockey

Indian women’s hockey : టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ కు వెళ్లింది. పూల్..ఏ మ్యాచ్ లో బ్రిటన్ చేతిలో ఐర్లాండ్ ఓటమి పాలైంది. ఐర్లాండ్ ఓటమితో క్వార్టర్ ఫైనల్ కు చేరుకుంది. ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్ కు చేరడం తొలిసారి.

టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేశారు. ఇవాళ జరిగిన గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్ లో 4-3తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.

దీంతో క్వార్టర్ ఫైనల్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. గ్రూప్-ఏలో మొత్తం 5 మ్యాచ్ లు ఆడిన భారత్ 2 మ్యాచ్ లలో గెలిచి, 3 మ్యాచ్ లలో ఓటమిపాలైంది.