Kerala High Court : విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు

క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం(డిసెంబర్ 9,2022) కొట్టివేసింది.

Kerala High Court : విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు

Kerala High Court

Kerala High Court : క్రిస్టియన్లకు విడాకుల మంజూరుపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసం ఏడాది పాటు విడిగా ఉండాలని నిర్ధేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం(డిసెంబర్ 9,2022) కొట్టివేసింది. తప్పనిసరి నిర్దిష్ట గడువును నిర్ధేశిస్తున్న ఈ నిబంధన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.

హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. విడాకుల కోసం దంపతులు రేండేళ్లుగా విడివిడిగా ఉండాలని తెలిపే విడాకుల చట్టంలోని అంతకముందు ఉన్న నిబంధనను హైకోర్టు 2010లో ఓ కేసు విషయంలో ఏడాదికి తగ్గించింది. అయితే ఇప్పుడు ఆ నిబంధనను పూర్తిగా రద్దు చేస్తూ కేరళ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

Online marriage : ఆన్‌లైన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ హైకోర్టు..ఎందుకంటే..

దంపతుల మధ్య వైవాహిక విభేదాలను కోర్టు సాయంతో పరిష్కరించేలా చట్టం ఉండాలని తెలిపింది. ఒకవేళ పరిష్కారం సాధ్యం కాని పక్షంలో ఆ దంపతులకు ఏది మంచిదో నిర్ణయించేందుకు కోర్టుకు చట్టం అనుమతించేలా ఉండాలని హైకోర్టు పేర్కొంది. ఓ క్రిస్టియన్ జంట విడాకుల కేసు విషయంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.