Madras High Court Key Orders : గుళ్లలోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడాన్ని నిషేధించాలని.. తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కూడా సూచించింది.

Madras High Court Key Orders : రాష్ట్రంలోని గుళ్లలోకి భక్తులు మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లడంపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాలయాల పరిశుద్ధత, పవిత్రతను కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అలాగే దేవాలయాల్లో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని కూడా సూచించింది. ఇప్పటికే తమిళనాడులోని తిరుచెందూర్ ఆలయంలోకి ఫోన్లను అనుమతించడం లేదు.

భక్తులతోపాటు ఆలయంలో పనిచేసే సిబ్బంది సైతం గుడి లోపలికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని నోటీసు బోర్టులు పెట్టారు. ఈ నిర్ణయాన్ని నవంబర్ 14 నుంచి అమలు చేస్తున్నారు. భక్తులు, ఆలయ సిబ్బంది సెల్ ఫోన్లను గుడి బయట డిపాజిట్ చేసేందుకు సెక్యూరిటీ కౌంటర్ ఏర్పాటు చేశామని తిరుచెందూర్ ఆలయ అధికారి తెలిపారు. టోకెన్లు కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Snake On Shiva Lingam : ఆలయంలో వింత.. శివలింగం చుట్టూ పాము ప్రదక్షిణలు, గర్భగుడిలో గంటకుపైగా శివలింగంపైనే..
సెల్ ఫోన్లు నిషేధం అనే నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే ఎవరిదగ్గరైనా ఫోన్ దొరికితే ఆ సెల్ ఫోన్ ను తిరిగి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అలాగే భక్తులు దేశ సంస్కృతికి అద్దంపట్లే దుస్తులు ధరించాలని గుడి ఆవరణలో నోటీసు బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు