Panneerselvam : మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ

మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది.

Panneerselvam : మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు గట్టి ఎదురుదెబ్బ

Panneerselvam

Panneerselvam : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పన్నీర్ సెల్వంకు భారీ షాక్ తగిలింది. మద్రాస్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే వర్గ పోరులో కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతోపాటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎరప్పాడి పళనిస్వామి పేరును అధికారికంగా ప్రకటించింది.

చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేశారు. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీరు సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు తాజా తీర్పుతో పన్నీరు సెల్వం ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

AIADMK: శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం తిరిగి కలిసి పోతున్నారా? అన్నాడీఎంకేపై శశికళ హాట్ కామెంట్స్

అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా, దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే, తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాస్ హైకోర్టుకు వదిలి వేసింది.