Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అచ్చం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి

సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్‭లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పాదయాత్ర అని, రెండవ దశ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అచ్చం రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి

The man who is a look-alike of Rahul Gandhi joins Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: అచ్చం రాహుల్ గాంధీలాగే ఉండే ఒక వ్యక్తి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీలాగే బట్టలు, గెడ్డం, నడకతో పాటు గొంతు కూడా కాస్త అలాగే ఉంది. దీంతో ఆ వ్యక్తి వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, సానుభూతిపరులైతే మరో రాహుల్ వచ్చారంటూ తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇదే రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన ఫైజల్ చౌదరి అనే వ్యక్తి బుధవారం బాఘ్‭పట్‭లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో చేరారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాసేపు నడిచారు. చూడడానికి అచ్చం రాహుల్ గాంధీలాగే ఉండడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా చౌదరితో కలిసి నడిచారు.


సెప్టెంర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. 100 రోజులకు పైగా యాత్రలో ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. మొత్తం 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర జమ్మూ కశ్మీర్‭లోని శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. అయితే మొదటి దశ పాదయాత్ర అని, రెండవ దశ గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంది.

Uttarakhand: హల్ద్వానీ ఆక్రమణ వ్యవహారంలో ట్విస్ట్.. ఉత్తరాఖండ్ హైకోర్టు ఆర్డర్‭పై సుప్రీంకోర్టు స్టే