Fish : అరుదైన చేప…కిలో రూ.13 వేలు

పశ్చిమబెంగాల్ లో దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత ఖరీదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్స్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.

Fish : అరుదైన చేప…కిలో రూ.13 వేలు

Fish

Most Expensive Fish : పశ్చిమబెంగాల్ లో దిఘా మత్స్యకారులకు కాసుల పంట పండింది. అత్యంత ఖరీదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలతో దిఘా మత్స్యకార సొసైటీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. మంగళవారం సముద్రంలో వేటకు వెళ్లిన 10 మంది జాలర్ల వలకు ఏకంగా 33 తెలియా భోలా చేపలు చిక్కాయి. దీంతో ఈ చేపలను వేలం వేయగా రికార్డు స్థాయిలో రూ.1.40 కోట్ల ధర పలికాయి.

వివరాల్లోకి వెళ్తే..పశ్చిమ బెంగాల్ లోని తూర్పు మేదినీపూర్ జిల్లా దిఘా ప్రాతంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అనూహ్యంగా వారి వలకు అరుదైన రకానికి చెందిన తెలియా భోలా చేపలు భారీగా వలకు చిక్కాయి. ఒక్కో చేప బరువు 33 నుంచి 35 కిలోల వరకు ఉంటుంది.

AP Fishing: మత్య్సకారులు వలలో అరుదైన చేపలు.. ఒక్కొకటి రూ.లక్ష!

ఈ చేపలను మెడికల్ క్యాప్సూల్స్ కవర్ల తయారీలో వినియోగించడంతో వీటికి భారీ గిరాకీ ఉంటుంది. వీటి కోసం కొనుగోలుదారులు ఎగుబడుతుంటారు. తమకు దొరికిన చేపలను వేలం వేయగా ఓ ఫార్మా కంపెనీ మొత్తం చేపలను దాదాపు రూ.1.4 కోట్లకు అమ్మినట్లు మత్స్యకారులు చెప్పారు. 75 కిలోల చేప ఒక్కటే రూ.36 లక్షలకు అమ్ముడు పోయింది.

కిలో రూ.13 వేల చొప్పున మొత్తం చేపలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రకం చేపల అంత సులువుగా వలకు చిక్కవని మత్స్యకారులు తెలిపారు. ఈ అరుదైన రకం చేపలు నడి సముద్రంలో సమూహాలుగా తిరుగుతాయని, కొన్నిసార్లు సమూహాల నుంచి విడిపోయినప్పుడు మాత్రమే ఇలా వలకు చిక్కుతాయని వెల్లడించారు.