NCB Inquiry : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం.. పెద్ద కేసుల్లో మాత్రమే ఎన్సీబీ విచారణ

గత ఏడాది ముంబై నుంచి వెళ్లిన క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్ సేవిస్తున్నారని షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

NCB Inquiry : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం.. పెద్ద కేసుల్లో మాత్రమే ఎన్సీబీ విచారణ

Ncb

Narcotics Control Bureau : దేశంలో రోజురోజుకి డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరికితే ఆ కేసుల విచారణలో జోక్యం చేసుకోవద్దని నిర్ణయించింది. కేవలం పెద్ద మొత్తం డ్రగ్స్ దొరకడం, రవాణాపై ఫోకస్ చేయనుంది. దీనికి సంబంధించి త్వరలో కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తక్కువ మోతాదులో మాదకద్రవ్యాలు పట్టుబడితే స్థానిక పోలీసులే విచారణ జరిపేలా మార్పులు చేయనుంది.

గత ఏడాది ముంబై నుంచి వెళ్లిన క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్ సేవిస్తున్నారని షారుఖ్‌ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరిని అరెస్ట్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆర్యన్‌ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అతని దగ్గర డ్రగ్స్ లేకున్నా…జైలులో పెట్టారని ఎన్సీబీపై ఆరోపణలు ఉన్నాయి.

Schools Karnataka : కర్ణాటకలో నేటి నుంచి స్కూల్స్ పునఃప్రారంభం

దీంతో ఎన్సీబీ అప్రతిష్టపాలు కాకుండా ఉండేందుకు ఈ కేసుల విచారణలో మార్పులు తీసుకురానుంది. నార్కోటిక్స్ అధికారులు కేవలం డ్రగ్స్ సిండికేట్, అధిక మోతాదులో రవాణా, ముఠాలను పట్టుకోవడంపై ఫోకస్ పెట్టనుంది. అయితే ఇందు కోసం భారీగా సిబ్బందిని పెంచుకోవాలని నిర్ణయించింది. ఇప్పుడున్న 11 వందల మంది సిబ్బందిని 3 వేలకు పెంచుకోనుంది.

ఇదిలా ఉండగా తాజాగా ఎన్సీబీ అధికారులు గుజరాత్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు తరలిస్తున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో డ్రగ్స్ సిండికేట్‌ పాత్ర ఉందన్నారు. దీని వెనక ఉన్న వారిని త్వరలో పట్టుకుంటామన్నారు.