NITI Aayog : ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి నంబర్ వన్ గా కేరళ

ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి కేరళ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ నిలిచింది.

NITI Aayog : ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి నంబర్ వన్ గా కేరళ

Kerala

Niti aayog released report : దేశంలో ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రాల పనితీరుపై నివేదిక విడుదల అయింది. వైద్యారోగ్య రంగంలో రాష్ట్రాల పనితీరుపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది. 2019-20కి సబంధించిన వివరాలతో నీతి ఆయోగ్ నివేదిక నివేదిక విడుదల చేసింది. ఆరోగ్య రంగం పనితీరులో మరోసారి కేరళ రాష్ట్రం నంబర్ వన్ గా నిలిచింది. వైద్య వ‌స‌తుల్లో వ‌రుస‌గా నాలుగోసారి కేర‌ళ అగ్ర‌స్థానంలో నిలవడం విశేషం.

రాష్ట్రాల వైద్య పురోగ‌తిపై 2019-20 ఏడాదికి సంబంధించిన 4వ హెల్త్ ఇండెక్స్ రిపోర్టును నీతి ఆయోగ్ సోమ‌వారం (డిసెంబర్ 27,2021) విడుద‌ల చేసింది. రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఏపీ నిలిచింది. పనితీరును మెరుగుపరుచుకుని తెలంగాణ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరింది.

Chandigarh : బీజేపీ,కాంగ్రెస్ కి ఝలక్.. చండీగఢ్ ఎన్నికల్లో ఆప్ సత్తా

మూడో స్థానం నుంచి నాలుగో స్థానాకి ఏపీ పడిపోయింది. 2018-19 సంవత్సరాలల్లో నీతి అయోగ్ జాబితాలో తెలంగాణ 4వ స్థానంలో నిల‌వ‌గా, 2019-20 ఏడాదిలో మూడో స్థానానికి చేరింది. అంటే తన స్థానాన్ని గతం కంటే మెరుగుపరుచుకుని మరో స్థానానికి ఎగబాకింది. పెద్ద రాష్ట్రాలు మాత్రం ఆరోగ్య రంగం పనితీరులో వెనుకబడినట్లుగా నీతి అయోగ్ వెల్లడించింది.

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఆఖరి స్థానంలో నిలవటం గమనార్హం. చిన్న రాష్ట్రాల జాబితాలో మిజోరం చక్కటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర పాలిత ప్రాంతాల విభాగంలో ఢిల్లీ, జ‌మ్మూక‌శ్మీర్ ముందు భాగంలో ఉన్నాయి. ప్రోత్సాహ‌క న‌మోదు రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ అగ్ర‌భాగాన నిలిచింది.