Third Front: కాంగ్రెస్ లేని కూటమి అసంపూర్ణమే

తీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు. కూటమిలో కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకమైనదని రౌత్ అభిప్రాయపడ్డారు.

Third Front: కాంగ్రెస్ లేని కూటమి అసంపూర్ణమే

Third Front

Third Front: దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కసరత్తు ముమ్మరంగా సాగుతుంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ అధ్యక్షతన దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలతో తాజాగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో థర్డ్ ఫ్రంట్ పైనే చర్చించినట్లు సమాచారం. మరోవైపు శరద్ పవార్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పలు మార్లు భేటీ అయ్యారు. ఇక వీరి భేటీలో కూడా థర్డ్ ఫ్రంట్ గురించే చర్చించినట్లుగా తెలుస్తుంది.

కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలన్నీ మూడవ ఫ్రంట్ గా ఏర్పడి 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని చర్చించుకున్నట్లు సమాచారం. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ థర్డ్ ఫ్రంట్ పై స్పందించారు. ఈ థర్డ్, ఫోర్త్ ఫ్రంట్లు బీజేపీని ఓడించలేవని తేల్చి చెప్పారు. దేశ వ్యాప్తంగా పలువురు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫ్రంట్స్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నం కొనసాగుతూనే ఉందని అయితే కాంగ్రెస్ ఇందులో భాగస్వామి కాకపోతే అది అసంపూర్ణమే అని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ అనేది వద్దని, ఇప్పటికే ఈ విషయాన్నీ శరద్ పవార్ ప్రకటించారని తెలిపారు. కూటమిలో కాంగ్రెస్ పాత్ర అత్యంత కీలకమైనదని రౌత్ అభిప్రాయపడ్డారు.

బీజేపీని అధికారంలోంచి దించగల బలమైన కూటమిని తయారు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని వ్యాఖ్యానించారు.