Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్

తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్

Rajya Sabha (1)

Rajya Sabha : రాజ్యసభ స్థానాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల దరఖాస్తు ప్రారంభంకానుంది. ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ఈ నెల 12న నోటిఫికేషన్‌ జారీ చేసింది. నామినేషన్‌ ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. వద్దిరాజుతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసిన్నప్పటికీ, ఆ రెండూ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురయ్యాయి.

TRS Rajyasabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

వద్దిరాజు నామినేషన్‌ ఒక్కటే సక్రమంగా దాఖలు కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఇక ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్. కృష్ణయ్య త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.