Gold Price: భారీగా పెరిగిన వెండి ధర.. అదే దారిలో బంగారం!

సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. కాగా, పసిడి ధరల్లో..

Gold Price: భారీగా పెరిగిన వెండి ధర.. అదే దారిలో బంగారం!

Gold Rate

Gold Price: సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండగలు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. కాగా, పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ఇప్పుడు మళ్ళీ పెరిగే పనిలో ఉంది. బంగారంతో పోలిస్తే వెండి భారీగా పెరుగుతుంది. ఈరోజు (ఆదివారం) వెండి ధర కిలో ఏకంగా రూ.900 పెరిగింది. బంగారం కూడా అదే బాటలో పయనిస్తుంది.

ఇక నిన్న(శనివారం) రూ.350 వరకు పెరిగిన బంగారం ధర తాజాగా ఆదివారం (అక్టోబర్ 3) దేశీయంగా స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,710 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,970 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,860 ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,480 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,480 ఉంది.

ఇక మన తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు చూస్తే.. హైదరాబాద్​ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,500 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47460గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47350 ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.47,460 ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే ఈ రోజు (అక్టోబర్ 3) వెండి ధరలు అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ. 900 వరకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,600 ఉండగా.. విజయవాడలో రూ.64,600 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.60,500 ఉండగా.. చెన్నైలో రూ.64,600 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.60,500 ఉండగా.. కోల్‌కతాలో రూ.60,500 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.60,500, కేరళలో రూ.64,600గా ఉంది.