tomato seed : టమాటలో విత్తనోత్పత్తికి అనుసరించాల్సిన విధానం

విత్తనోత్పత్తిలో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. అధిక అల్ప నీటి తడులు ప్రమాదం. 7-15 రోజుల మధ్య నీటి తడులివ్వాలి. నీటి ఎద్దడి ఏర్పడితే వూత, పిందె రాలిపోతుంది.

10TV Telugu News

రాష్ట్రంలో సాగవుతున్న కూరగాయలలో ప్రధాన పంట టమాట. వర్షాక్రాలంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంది. చిన్న సన్నకారు రైతులు కూడా ఎక్కువగా ఈ పంటను వేస్తారు. తమకు కావలసిన విత్తనాలను సొంతంగా ఉత్పత్తి చేసుకునే వీలుంది. అందుకు కొన్ని మెళకువలు పాటించాలి.

టమాట ఉష్ణ మండలపు పంట. విత్తనోత్పత్తికి సుమారు 4 నెలల పాటు మంచు రహిత వాతావరణం అవసరం. 16 నుండి 29 సెం. ఉష్ణోగ్రత విత్తనం మొలకెత్తటానికి అనుకూలం. మొక్కల అభివృద్ధికి, కాయలు ఏర్పడటానికి 20 నుండి 25″ సెం. ఉష్ణోగ్రత ఉండాలి. 15 సెం. కంటే తక్కువ, 32″ సెం. కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పుప్పొడి రేణువులు చనిపోతాయి. అందువల్ల కాయలు కట్టే అవకాశం తగ్గుతుంది. అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి కాయలు ఏర్పడే శాతాన్ని తగ్గిస్తాయి. అధిక ఉష్టోగ్రత్క వేడిగాలులు వల్ల పూత పిందె రాలుతుంది. వెచ్చని సూర్యరశ్మితో కూడిన వాతావరణం, కాయలు ఏర్పడటం, కాయల అభివృద్ధి, విత్తన అభివృద్ధికి అత్యంత అనుకూలం.

రాష్ట్రంలో సాధారణంగా ఖరీఫ్‌, రబీ, వేసవి కాలాలలో సాగు చేసే అన్ని సూటి రకాల విత్తనోత్పత్తి వేసవిలో చేపట్టవచ్చు. అయితే విత్తనోత్పత్తిలో టమాట పూత, సంపర్మం చెందే లక్షణాలపై అవగాహన అవసరం. ఒక పూగుత్తిలో సరాసరిన 4- 5 పూలు ఉంటాయి. పూలు విచ్చుకోవటం నేలలో తేమ, ఉష్ణోగ్రతను బట్టి ఉంటుంది. ఉదయం 8.30 – 10.30 గంటల మధ్య పూలు విచ్చుకుంటాయి. 9-10.30 గంటల మధ్య పుష్పాడి రేణువులు విడుదలవుతాయి. 8.30 – 11.30 గంటల మధ్య సమయంలో కీలాగ్రం చుట్టూ పుప్పొడి అశయాలు ఉండటం వల్ల టమాట ప్రధాన స్వపరాగ సంపర్కం చెందే పంట. అయితే బంబుల్‌ ఈగలు పూలను తరచు సందర్భించటం వల్ల 3.8% వరకు పరపరాగ సంపర్కం జరిగే అవకాశాలున్నాయి.

మేలైన మురుగు నీటి పారుదల సౌకర్యమున్న ఒండ్రుమట్టి నేలలు, ఎర్రనేలలు, ఇసుకతో కూడిన ఒంద్రునేలలు ఈ పంట సాగుకు అనుకూలం. ఉదజని సూచిక 6-7 మధ్య ఉండి తేమ నిలుపుకునే సామర్థ్యమున్న నేలలు అనుకూలంగా ఉంటాయి. హెక్టారుకు 25 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 100 కిలోల నత్రజని, 50 కిలోల చొప్పున భాస్వరం, పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. మొత్తం భాస్వరం, పొటాష్‌లు, 30 శాతం సిఫార్సు నత్రజని ఎరువును దుక్కి సమయంలో, మిగతా నత్రజనిని రెండు దఫాలుగా ప్రధాన పొలంలో నాటిన 30, 50 రోజుల తర్వాత వంటకు అందించాలి. పైపాటు ఎరువులు వేసిన తర్వాత, బోదెలు సరిచేసిన తర్వాత ఖచ్చితంగా తేలికపాటి నీటి తదులివ్వాలి. విత్తన మోతాదు : హెర్టారుకు 500 – 600 గ్రాములు.

సంవత్సరమంతా విత్తుకోవచ్చు. అయితే జనవరి-మార్చి మొదటి వారం వరకు విత్తుకుంటే విత్తనోత్పత్తి ఎక్కువ అయితే సాగు నీటి సౌకర్యం ఖచ్చితంగా ఉందాలి. ఎత్తైన నారుమడులలో మాత్రమే నారు పెంచాలి. నీటి క్యాన్‌లతో రోజూ నారుమడులను తడపాలి. చలి కాలంలో అయితే పాలిథీన్‌ షీట్‌లతో కప్పి అధిక చలి తీవ్రత నుండి కాపాడుకోవాలి. మొక్కలు 45 సెం.మీ. ఎత్తు పెరిగినప్పుడు, ఆరోగ్యవంతమైన వాటిని ఉంచి, తెగులు సోకిన, అంతగా ఎదగని మొక్కలను తీసివేయాలి. 12-15 సెం.మీ. ఎత్తు పెరిగి 45 వారాల మొక్కలను ప్రధాన పొలంలో నాటాలి. మార్చి చివరి నాటికి ప్రధాన పొలంలో నాటడం పూర్తిచేయాలి. చలి తగ్గిన తర్వాత నాటాలి. బోదెల చివర్లో 60-75 సెం.మీ. దూరంలో నాటాలి. మొక్కకు మొక్కకు మధ్య 45-60 సెం.మీ. దూరం ఉండాలి. కలువు నివారణకు సంబంధించి హెక్టారుకు ఒక కిలో చొప్పున పెండిమిథాలిన్‌,650 లీటర్ల నీటిలో కలిపి మొక్కలు నాటిన 3నుండి 5 రోజులలోపు పిచికారి చేసి కూడా కలువు నివారించవచ్చు.

నీటి యాజమాన్యం :

విత్తనోత్పత్తిలో నీటి యాజమాన్యం అత్యంత కీలకం. అధిక అల్ప నీటి తడులు ప్రమాదం. 7-15 రోజుల మధ్య నీటి తడులివ్వాలి. నీటి ఎద్దడి ఏర్పడితే వూత, పిందె రాలిపోతువంది. ఆ తర్వాత ఒకేసారి ముమ్మరంగా నీటి తడులిచ్చినా కాయ అభివృద్ధి తగ్గిపోతుంది. కాబట్టి తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు నీటిని అందించాలి.

స్వచమైన విత్తనోత్పత్తికి టమాటలో మూడు సార్లు కల్తీలు ఏరివేయాలి. శాఖీయ దశ, పూర్తి పూత దశ్శ కాయలు ముదిరే దశలో భౌతిక లక్షణాల ఆధారంగా కల్తీలు గుర్తించాలి. వీటతో పాటు ఆకుమచ్చ తెగులు, మొజాయిక్‌ తెగుళ్లు, ఎర్లీజైట్‌ సోకిన మొక్కలను ఏరివేయాలి. విత్తన పొలంలో కల్తీలు 0.5 శాతం కంటే ఎక్కువగా ఉండరాదు. అలాగే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లు సోకిన మొక్కలు కూడా 0.50 శాతం మించి ఉండకూడదు. విత్తన సేకరణకు బాగా ఎరుపుగా వండిన పండ్లను మాత్రమే ఎంచుకోవాలి. నాణ్యత బాగుండేందుకు మొదటి దశ అలాగే చివరి దశలో వచ్చిన వండ్ల నుండి గింజలు సేకరించరాదు.

విత్తన సేకరణ పద్ధతులకు సంబంధించి మూడు వద్ధతులు అందుబాటులో ఉన్నాయి. పులియబెట్టే పద్ధతి: ఎర్రగా వండిన పండ్లను పిసికి ఇనుపేతర గిన్నెలో పులియబెట్టాలి. వేసవిలో అయితే 24-48 గంటలు, యాసంగిలో అయితే 48-72 గంటలు పులియబెట్టాలి. ఈ విధానం పూర్తయ్యే సరికి గుజ్ఞుపై నురుగు ఏర్పడుతుంది. గింజలు మిగతా పదార్థం నుండి వేరవుతాయి. ఆ తర్వాత నీటిలో ఉంచితే విత్తనం అడుగు భాగానికి చేరుతుంది. గుజ్జు, ఇతర పదార్థాలు పైన తేలుతాయి. విత్తనం వేరుగా కడిగి శుభ్రపరచాలి. ఎక్కువ సమయం పులియకుండా చూడాలి. అమ్ల శద్ధి పద్ధతి విషయానికి వస్తే 11 కిలోల టమాట గుజ్ఞుకు 100 మి.లీ. చొప్పున హైడ్రోక్లోరిక్ ఆమ్లం బాగా కలివి 30 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రపరచి నిల్వ చేసుకోవాలి.

 

×