భారత్ లో కరోనా నియంత్రణలో ఉంది…బాధితుల రికవరీ రేటు 62.5 శాతం

  • Published By: bheemraj ,Published On : July 21, 2020 / 07:47 PM IST
భారత్ లో కరోనా నియంత్రణలో ఉంది…బాధితుల రికవరీ రేటు 62.5 శాతం

భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. భారత్‌లో మరణాల రేటు 2.43గా ఉందని పేర్కొంది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య 11,55,191గా ఉంది. గడిచిన 24 గంటల్లో 37, 148 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 7,24,578 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో 4,02, 529 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.