సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు…మోడీ

సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు…మోడీ

PM Modi’s Poem For 2021 కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా “ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు” అంటూ ప్ర‌ధాని మోడీ ఓ కవితను కూడా రాశారు. మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ క‌విత‌తో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు.

ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని ఈ ప్రేర‌ణాత్మ‌క క‌వితతో ప్రారంభిద్దామ‌ని ఆ ట్వీట్‌లో తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ప్ర‌ధాని చేప‌ట్టిన ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు సైనికులు, మెడిక‌ల్ సిబ్బంది, రైతుల‌తో ఆ వీడియోను రూపొందించారు. మోడీ వాయిస్ ఓవర్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మోడీ.. ఇటీవ‌ల గురుద్వారా విజిట్ చేసిన ఫోటోల‌ను కూడా ఆ వీడియోలో పోస్టు చేశారు.

కవితా పంక్తులు మోడీ మాటల్లోనే..

వినీల ఆకాశంలో త‌ల పైకెత్తి

ద‌ట్ట‌మైన మేఘాల‌ను చీల్చుకొని

వెలుగు లాంటి సంకల్పం తీసుకుందాం

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!

దృఢ నిశ్చయంతో అడుగులు వేస్తూ

ప్రతి అడ్డంకిని దాటుతూ

కారుచీకట్లను తొలగించడానికై

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!

విశ్వాసపు జ్యోతులను వెలిగించి

అభివృద్ధి దీపాలను తీసుకొని

స్వప్నాలను సాకారం చేసుకోవడానికి

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!

నీదీ నాదీ.. వాళ్లదీ వీళ్లదనే తేడాల్లేక

అందరి తేజమై ప్రకాశిస్తూ

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!

నిప్పులు చెరుగుతూ.. వెలుగుల్ని వెదజల్లుతూ

తాను నడుస్తూ.. అందర్నీ నడిపిస్తూ

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!

ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు!