Supreme Court : ఢిల్లీ షాహిన్ బాగ్ లో కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు

షాహిన్‌బాగ్‌లో ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Supreme Court : ఢిల్లీ షాహిన్ బాగ్ లో కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు

Supreme Court (1)

Supreme Court : ఢిల్లీ షాహిన్‌బాగ్ కూల్చివేతలపై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన వారిలో బాధితులు లేరని తెలిపింది. రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేసిందని వెల్లడించింది. రాజకీయాలకు వేదిక చేయవద్దని పిటిషనర్‌పై సీరియస్ అయింది. సుప్రీంకోర్టును రాజకీయాలకు వేదిక చేయొద్దని జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం పేర్కొంది. కూల్చివేతల విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని బాధితులకు, పిటిషనర్లకు సూచించింది.

అక్రమ నిర్మాణాల కూల్చివేత‌కు మ‌ళ్లీ బుల్డోజ‌ర్లు క‌దిలాయి. ఢిల్లీలోని షహీన్‌భాగ్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ చేప‌ట్టారు. సౌత్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ష‌హీన్‌భాగ్‌లో ఈ డ్రైవ్ చేపట్టారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం-CAAకు వ్యతిరేకంగా ష‌హీన్‌భాగ్‌లో కొన్నేళ్ల క్రితం నిర‌స‌న ప్రద‌ర్శన‌లు జ‌రగ్గా… తాజా కూల్చివేతలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Bulldozrr politics : దేశాన్ని భయపెడుతున్న బుల్డోజర్ రాజకీయాలు..యూపీలో మొదలై హస్తినకు అరాచకాలు

షాహిన్‌బాగ్‌లో ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇక ష‌హీన్‌భాగ్‌లోకి బుల్డోజ‌ర్లు రావ‌డంతో.. స్థానికులు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించి బుల్డోజ‌ర్లను అడ్డుకున్నారు. దీంతో అధికారులు బుల్‌డోజర్లను వెనక్కి తిప్పారు.