ఓటీటీలను నియంత్రించాల్సిందేనన్న సుప్రీంకోర్టు

ఓటీటీలను నియంత్రించాల్సిందేనన్న సుప్రీంకోర్టు

OTTs should be controlled : ఓటీటీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఓటీటీల నియంత్రణకు కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

కేంద్రం విధించిన తాజా మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో ఓటీటీలను నియంత్రించలేవని జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు. అటు తాండవ్ వెబ్ సిరీస్ కేసులో అమెజాన్ ప్ర్రైమ్ అధినేత అపర్ణా పురోహిత్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.

తాండవ్‌ వెబ్‌సిరీస్‌లో ఓ వర్గం మనోభావాలు దెబ్బతీశారని యూపీలో నమోదైన కేసులపై అపర్ణా పురోహిత్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు..దర్యాప్తుకు సహకరించాలని పురోహిత్‌ను ఆదేశించింది.