Vijay Mallya : విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా

2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్‌ మాల్యా 40 మిలియన్‌ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.

Vijay Mallya : విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా

Vijay Mallya

Vijay Mallya : విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా విధించింది. విజయ్ మాల్యా 2017లో కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నాలుగు వారాల్లో రూ.312 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేయకుంటే ఆస్తులు అటాచ్ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.

Vijay Mallya: విజయ్ మాల్యా రోడ్డు మీదకు.. ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ

జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2017లో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ విజయ్‌ మాల్యా 40 మిలియన్‌ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. నిధుల బదలాయింపు సమాచారాన్ని మాల్యా సుప్రీంకోర్టుకు చెప్పే ప్రయత్నం చేయలేదు.