Supreme Court : లఖింపూర్‌ ఖేరీ ఘటనపై మరోసారి విచారణ

లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈనెల 20న లఖింపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సీజేఐ ఎన్‌వీ రమణ యూపీ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు.

Supreme Court : లఖింపూర్‌ ఖేరీ ఘటనపై మరోసారి విచారణ

Supreme Court

Lakhimpur Kheri incident : లఖింపూర్‌ ఖేరీ ఘటనపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ నెల 20న లఖింపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే స్టేటస్ రిపోర్ట్ ఆలస్యంగా కోర్టుకు సమర్పించడంపై సీజేఐ ఎన్‌వీ రమణ.. ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్‌పై అసహనం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.

స్టేటస్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించారు. యూపీ ప్రభుత్వం 44 మంది సాక్ష్యులను విచారించి.. నలుగురి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగిలినవారివి ఎందుకు చేయలేదు? కేవలం నలుగురి వాంగ్మూలాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? అంటూ సుప్రీం మండిపడింది.

Lakhimpur Kheri : లఖింపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగ్యూ

దర్యాప్తులు ఎప్పుడూ అంతులేని కథలుగా మిగలకూడదని.. సాక్ష్యులను త్వరగా విచారించండని ఆదేశించింది. కేసును ఇవాళ్టికి వాయిదా వేసింది. నేటి విచారణకు ముందే స్టేటస్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 3న యూపీలో లఖింపూర్‌లో సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన పెద్ద ఎత్తున హింసకు దారి తీసింది.

రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా… అనంతరం చెలరేగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.