Thief Escaped: వైరల్ వీడియో.. పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ

దొంగలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ఎత్తులు వేస్తుంటారు. దొరికిన తర్వాత కూడా పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసుల కళ్లుగప్పి పారిపోతారు కూడా. ఇటువంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను అరియనా జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు.

Thief Escaped: వైరల్ వీడియో.. పోలీసుల నుంచి తప్పించుకుని డ్రైనేజీలో దూకిన దొంగ

Thief Escaped

Thief Escaped: దొంగలు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అనేక ఎత్తులు వేస్తుంటారు. దొరికిన తర్వాత కూడా పారిపోయేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పోలీసుల కళ్లుగప్పి పారిపోతారు కూడా. ఇటువంటి సంఘటనే బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగను అరియనా జిల్లాలో అరెస్ట్ చేశారు పోలీసులు. స్టేషన్ కు తరలించిన అనంతరం కోర్టు ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తీసుకెళ్తున్నారు.

ఇదే సయమంలో దొంగ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అనంతరం ఓ పెద్ద డ్రైనేజీ కాలువలోకి దూరాడు. దొంగ ఆలా దూరుతాడని పోలీసులు కూడా ఉహించి ఉండరు. తప్పించుకున్న దొంగకోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఎంతకీ అతడు దొరకలేదు. అయితే దొంగ డ్రైనేజీ కాలువలోకి దిగుతుంటే కొందరు గమనించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. దొంగ దిగిన దగ్గరకు చేరుకున్న పోలీసులు కాలువను ఓసారి పరిశీలించారు.

మురికినీరు పారుతుండటం చెత్తాచెదారం అధికంగా ఉండటంతో అందులోకి దిగేందుకు సాహసించలేదు. ఓ జేసీబీని పిలిపించి డ్రైనేజీ కలువమీద వేసిన బండలను తొలగించి దొంగను పట్టుకున్నారు పోలీసులు. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశంలో ఇంకెంతమంది దొంగలు డ్రైనేజీ కాలువల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరు దొంగ తెలివిని మెచ్చుకుంటున్నారు.. మరికొందరు పోలీసుల చేతిలో నీకు మూడింది అంటున్నారు.