Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఆటో, టెలికాం రంగాలకు భారీ ఊరట

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా దెబ్బతో కొట్టుమిట్టాడుతున్న ఆటో ఇండస్ట్రీకి, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఆటో, టెలికాం రంగాలకు భారీ ఊరట

Cabinet (1)

auto and telecom sectors : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా దెబ్బతో కొట్టుమిట్టాడుతున్న ఆటో ఇండస్ట్రీకి, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆటో సెక్టార్‌కు రూ. 26 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వాహన తయారీ, వాహన విడి భాగాల తయారీ, డ్రోన్ల తయారీ పరిశ్రమల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రానున్న ఐదేళ్లలో కొత్తగా 42 వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

అదనపు ఉత్పత్తి విలువ రూ. 2.3 లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది. డ్రోన్ల తయారీలో ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ ద్వారా రానున్న మూడేళ్లలో రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో పాటు రూ.1,500 కోట్ల మేర అదనపు ఉత్పత్తి జరుగుతుందని అంచనా. తాజా నిర్ణయాలతో భారత్‌లో తయారీ సామర్థ్యం పెరగుతుంది. పర్యావరణ హిత ఎలక్ట్రానిక్‌ వాహనాలు, హెడ్రోజన్ ఫ్యూయల్‌ సెల్‌ వాహనాల తయారీకి ఊతమిస్తుంది. 7 లక్షల 60 వేల మందికి ఉపాధి లభించనుంది.

Telecom Sector : టెలికాం రంగంలో భారీ సంస్కరణలు..వంద శాతం ఎఫ్ డీఐలకు కేంద్రం అనుమతి

టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. టెలికాం రంగంలో 9 స్ట్రక్చరల్‌ రిఫామ్స్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలపై మారటోరియం ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిలు, స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో వొడాఫోన్, ఐడియా, ఎయిర్‌ టెల్‌ కంపెనీలకు ఊరట లభించనుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్టాక్‌ మార్కెట్‌లో టెలికాం కంపెనీల షేర్లు దూసుకెళ్లాయి.