Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు

ఇప్పటికే అన్ని ఆధారాలను కోర్టు ముందుంచామని...అది హిందూ ఆలయమే అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని హిందూ సంస్థల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అసలు పిటిషన్లు విచారణకు అర్హం కాదని ముస్లిం సంఘాల న్యాయవాదులు వాదించారు.

Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు

Gyanvapi Mosque

gyanvapi mosque : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఇవాళ వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే జ్ఞానవాపి మసీదులో చేసిన సర్వేకు సంబంధించిన తమ నివేదికను వీడియోగ్రఫీతో సహా కోర్టుకు అందించారు సర్వేయర్లు. దీంతో కోర్టు తీర్పును ఇవాళ మధ్యాహ్నానికి రిజర్వ్ చేసింది. సర్వే రిపోర్ట్‌ను న్యాయమూర్తులు పరిశీలించిన తర్వాత.. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించాలా వద్దా అన్నది తేల్చనున్నారు.

ఇప్పటికే అన్ని ఆధారాలను కోర్టు ముందుంచామని…అది హిందూ ఆలయమే అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని హిందూ సంస్థల న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అసలు పిటిషన్లు విచారణకు అర్హం కాదని ముస్లిం సంఘాల న్యాయవాదులు వాదించారు. వాదనల తర్వాత తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది.

GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

మసీదులో శివలింగం ఉందంటున్న ప్రాంతంలో పూజలకు అనుమతించాలని హిందూ సంఘాల తరఫు లాయర్ కోరారు. మసీదు పిల్లర్లపై కలశం, పుష్పాలు చెక్కిన గుర్తులు ఉండగా.. మసీదు వద్ద ఉన్న కోనేరులో 2.5 ఫీట్ల శివలింగం ఉందంటున్నారు. అయితే మసీదు వద్ద ఉన్నది శివలింగం కాదని.. ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదిస్తోంది. అదేవిధంగా 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది.