Nitish Kumar: అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‪‌ను మార్చినట్లుగా.. నితీష్ కుమార్‌పై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

విదేశీ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‪‌ను మార్చినట్లుగా బిహార్ సీఎం నితీష్ కుమార్ పొత్తుల కోసం పార్టీలు మారుస్తుంటాడని విమర్శించాడు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Nitish Kumar: అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‪‌ను మార్చినట్లుగా.. నితీష్ కుమార్‌పై బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్‌పై మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‪‌ను మార్చినట్లుగా నితీష్ కుమార్ కూడా పొత్తుల కోసం పార్టీలను మారుస్తుంటాడని విమర్శించాడు. ఇండోర్, బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ విజయవర్గియ ఈ వ్యాఖ్యలు చేశాడు.

Supreme Court: డోలో ట్యాట్లెట్ రాసినందుకు డాక్టర్లకు వెయ్యి కోట్లు… సుప్రీం కోర్టులో విచారణ

గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం నితీష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి వాళ్లెవరో ఒక విషయం చెప్పారు. అక్కడి అమ్మాయిలు, మహిళలు బాయ్‌ఫ్రెండ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మారుస్తుంటారని. ఇప్పుడు బిహారీ సీఎం నితీష్ కుమార్ కూడా అలాగే చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో.. ఎప్పుడు వదిలేస్తారో తెలియదు’’ అని కైలాష్ వ్యాఖ్యానించాడు. గతంలో కూడా కైలాష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అగ్నివీర్‌లను పార్టీ సెక్యూరిటీ గార్డులుగా పేర్కొన్నాడు. తర్వాత ఇదంతా ‘టూల్ కిట్ గ్యాంగ్’ చేసిన వక్రీకరణగా పేర్కొన్నాడు.

Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. మెడికల్ విద్యార్థులు తిరిగి రావాలన్న ఉక్రెయిన్

కాగా, తాజాగా కైలాష్ చేసిన వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. ఇటీవలే బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికిన బిహార్ సీఎం నితీష్ కుమార్.. కాంగ్రెస్, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.