Crime News: చపాతీ తెచ్చిన తంట.. భార్య కర్ణభేరి పగిలింది..

చిన్న విషయం ఆ ఇంటిలో భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు చేరింది. మహారాష్ట్ర బద్లాపూర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ ఇంటిలో నికుంభ్ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇంట్లో నికుంభ్ తో పాటు భార్య, వారి తల్లిదండ్రులు ఉంటారు.

Crime News: చపాతీ తెచ్చిన తంట.. భార్య కర్ణభేరి పగిలింది..

Crime News (2)

Crime News: చిన్న విషయం ఆ ఇంటిలో భార్య, భర్తల మధ్య పెద్ద వివాదానికి దారితీసింది. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ కు చేరింది. మహారాష్ట్ర బద్లాపూర్ కు తూర్పున ఉన్న షిర్ గావ్ మౌలీచౌక్ లోని ఓ ఇంటిలో నికుంభ్ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఇంట్లో నికుంభ్ తో పాటు భార్య, వారి తల్లిదండ్రులు ఉంటారు. అయితే ఇంట్లో అత్తా కోడలి మధ్య పలుసార్లు వివాదం జరిగింది. దీంతో నికుంభ్ వారికి సర్దిచెప్పడంతో సర్ధుమణిగేది. పలు సార్లు ఇలాగే జరగడంతో వారిని వారించాడు. మరోసారి గొడవపడితే ఊరుకోనంటూ హెచ్చరించారు. సోమవారం రాత్రి మరోసారి అత్తాకోడలి మధ్య జరిగిన సంభాషణ పెద్ద వివాదానికి దారితీసింది. ఆ విషయం కాస్త పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో పోలీసులు నికుంభ్ ను స్టేషన్ కు పిలిపించారు.

Oklahoma: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి..
సోమవారం రాత్రి భార్య కోమల్ వంటగదిలో భోజనం తయారు చేస్తుంది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన అత్త చపాతీ బాగా చేస్తావా? అంటూ ప్రశ్నించింది. మా అత్తగారిని దృష్టిలో పెట్టుకొని బాగానే తయారు చేస్తాను అంటూ కోడలు బదులిచ్చింది. కోడలి సమాధానంతో అత్తకు కోపంకట్టలు తెంచుకుంది. నన్నే యటకారంగా మాట్లాడతావా అంటూ మండిపడింది. దీంతో వీరి మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరింది. అశ్విన్ వచ్చి ఇద్దరికి సర్దిచెప్పే ప్రయత్నంచేసినప్పటికీ వారిరువురి మధ్య వివాదం సర్దుమణగలేదు. దీంతో నికుంభ్ భార్యను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవటంతో ఆగ్రహంతో కోమల్ ఎడమ చెవిపై రాయితో బలంగా కొట్టాడు. రాయి బలంగా తాకడంతో కర్ణభేరి పగిలిపోయింది. అయినా ఆగని నికుంభ్ బెల్టు తీసుకొని కొట్టాడు. దీంతో కన్నీరుమున్నీరవుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కోమల్ భర్త చేసిన నిర్వాహకంపై పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.