Husband Caught In Hotel: ప్రియురాలితో హోటల్‌లో భర్త రాసలీలలు.. ఇద్దరిని చితకబాదిన భార్య.. వీడియో వైరల్

భర్త తన ప్రియురాలితో ఓ హోటల్ గదిలో రాసలీలలు సాగిస్తున్న క్రమంలో భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. రూంలో ఉన్న భర్త, భర్త ప్రియురాలిని చెప్పుతో చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Husband Caught In Hotel: ప్రియురాలితో హోటల్‌లో భర్త రాసలీలలు.. ఇద్దరిని చితకబాదిన భార్య.. వీడియో వైరల్

Husband Caught In Hotel

Husband Caught In Hotel: ఢిల్లీ గేట్ వద్ద రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఓ హోటల్‌లో భర్త తన ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్నట్లు గుర్తించిన భార్య హోటల్ కు వెళ్లి వారిని రెడ్ హ్యాడెడ్ గా పట్టుకుంది. ఆగ్రహంతో ఇద్దరినీ చెప్పు తీసుకొని చితకబాదింది. హఠాత్తుగా వచ్చి భార్య కొట్టడంతో షాక్ తిన్న భర్త, ప్రియురాలు చేతులు జోడించి క్షమాపణలు చెబుతూనే ఉన్నారు. చేతిలో చెప్పు పట్టుకున్న భార్య ఇంతకు ముందు ఎన్నో అవకాశాలు ఇచ్చా, అయినా మారలేదా అంటూ మళ్లీ కొట్టింది. హోటల్‌లో భర్త, ఆయన ప్రియురాలును చెప్పుతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

WhatsApp Blocked Tips : వాట్సాప్‌లో మీ కాంటాక్ట్ బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవచ్చు.. ఇదిగో ఈ 5 టిప్స్ మీకోసం..!

ఈ సంఘటన సోమవారం రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆగ్రాకు చెందిన జంటకు 16ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె వయస్సు సుమారు 16 సంవత్సరాలు. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త మరో మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న భార్య పలుసార్లు మందలించింది. భర్తతో పాటు భర్త ప్రియురాలికిసైతం వార్నింగ్ ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాకపోవటంతో భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు బంధువులకు అప్రమత్తం చేసింది. సోమవారం రాత్రి రాజమండి రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌కు భర్త తన ప్రియురాలితో వచ్చాడని భార్యకు సమాచారం అందింది.

ఆమె నేరుగా హోటల్ గదిలోకి వెళ్లింది. ప్రియురాలితో భర్త గదిలో ఉన్నాడు. భార్య ఏమీ మాట్లాడకుండా మంచంపై కూర్చున్న భర్తను చెప్పులు తీసి కొట్టడం ప్రారంభించింది. దయచేసి ఈసారి క్షమించు అంటూ చేతులు జోడించి భర్త వేడుకున్నాడు. అదే సమయంలో భర్త ప్రియురాలు ఆమె ముఖాన్ని దుప్పటితో చుట్టుకుంది. ఆమెనుసైతం మహిళ చెప్పుతో చితకబాదింది. ప్రియురాలు ఏదో చెప్పాలనుకున్నప్పుడు ఆమె జుట్టు పట్టుకుని మళ్లీ కొట్టింది. కాగా ఈ వీడియోలో భర్త మళ్లీ మళ్లీ క్షమాపణలు కోరుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం వివిధ వాట్సాప్ గ్రూపుల్లో వ్యాపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.