Woman Hand Black :నల్ల బొగ్గులా మారిపోయిన అబార్షన్ చేయించుకున్న మహిళ చెయ్యి

గురుగ్రామ్​లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వినిత అనే మహిళ ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకుంది. అబార్షన్ చేయించుకున్న తరువాత ఆమె అనారోగ్యానికి గురికాగా డాక్టర్లు ఆమెకు ఓ ఇంజెక్షన్ చేశారు. అనంతరం కొంతసేపటికే ఆమె చెయ్యి నల్లటి బొగ్గురంగులో మారిపోయింది.

Woman Hand Black :నల్ల బొగ్గులా మారిపోయిన అబార్షన్ చేయించుకున్న మహిళ చెయ్యి

Women Hand Black Color

woman hand turned black after abortion : హర్యానాలోని గురుగ్రామ్​లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. వినిత అనే మహిళి ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకుంది. అనంతరం అనారోగ్యానికి గురైంది. దీంతో తిరిగి అబార్షన్ చేయించుకున్న హాస్పిటల్ కు రాగా డాక్టర్లు ఆమెకు ఓ ఇంజెక్షన్ చేసి మెడిసినస్ రాసిచ్చారు…కానీ ఆ ఇంజెక్షన్ చేశాక ఆమె చెయ్యి నల్లటి బొగ్గురంగులో మారిపోయిన ఘటన దుండహేరా గ్రామంలో చోటుచేసుకుంది.

వినిత,సర్పరాజ్ ​దంపతులు. ఆమె గర్భవతి అయ్యింది. కానీ ఏం జరిగిందో గానీ..వినిత అబార్షన్ చేయించుకోవాలనుకుంది. దీంతో వినిత భర్త సర్పరాజ్ తో కలిసి దుండహేరా గ్రామంలోని పార్క్​ అనే ప్రైవేటు ఆసుపత్రికిలో ఏప్రిల్​ 23న అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత డాక్టర్​లు ఆమెకు యాంటి బయోటిక్​ ఇంజక్షన్​ ఇచ్చారు.

ఈ ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని గంటలకే వినిత శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయి. అది గమనించిన వినిత కంగారుపడిపోయింది. కుడి చెయ్యి నల్లటి రంగుంలోకి మారిపోవటంతో భయపడిపోయింది. వెంటనే ఆమె భర్త అబార్షన్ చేసిన హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు మెడిసిన్స్ మార్చారు. కానీ ఏమాత్రం మార్పురాలేదు. వెంటనే ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రేలే ఆమెకు ఇన్ఫెక్షన్ కు గురైనట్లుగా తెలిసింది. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీలోని ఆర్​ఎమ్​ఎల్​ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పార్క్ హాస్పిటల్ వైద్య సిబ్బంది చెప్పారు.

కానీ సర్పరాజ్ మీరు రాసిచ్చిన మెడిసిన్స్ వల్లనే ఇదంతా జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తన భార్యకు గర్భాస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీ బయోటిక్​ ఇంజక్షన్​ ఇవ్వడం వల్లనే ఇలా జరిగిందని సర్పరాజ్​ ఆరోపించాడు. తన భార్యను తీసుకొని వెంటనే ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించగా అక్కడి డాక్టర్లు వినిత చెయ్యిని చూసి షాక్ అయ్యారు.వెంటనే ఆమెను పరీక్షించగా.. ఆమె కుడి చేయి పూర్తిగా ఇన్​ఫెక్షన్​కు గురైందని వెంటనే చెయ్యిన తొలగించాలని లేదంటే అది ఒంటికి కూడా సోకుతుందని.. దానికోసం చాలా ఖర్చుఅవుతుందని కూడా తెలిపారు.

అది విన్న సర్పరాజ్ భయపడిపోయాడు. అసలే..కరోనా తెచ్చిన కష్టంతో తనకు ఉన్న ఉద్యోగం పోయింది. ఇప్పుడీ హాస్పిటల్ ఖర్చులు ఎలా భరించాలి అనుకునే క్రమంలో భార్య చెయ్యి తొలగించాలని దానికి బోలెడు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పటంతో ఏంచేయాలతో తెలీక తల పట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు దగ్గరు ఉన్న కొద్దిపాటి డబ్బుతో అన్ని ఖర్చులు నెట్టుకొచ్చానని..ఇప్పుడేం చేయాలని తల్లడిల్లిపోయాడు. ఆపరేషన్​కు అయ్యే ఖర్చుకూడా భరించే స్థితిలో లేనని వాపోయాడు.