Narendra Giri Maharaj : మహంత్‌ నరేంద్రగిరిది హత్యా? ఆత్మహత్యా?

అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి మహరాజ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహంత్‌ నరేంద్ర గిరి సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Narendra Giri Maharaj : మహంత్‌ నరేంద్రగిరిది హత్యా? ఆత్మహత్యా?

Mahant

Narendra Giri Maharaj death : అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి మహరాజ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహంత్‌ నరేంద్ర గిరి సూసైడ్‌ నోట్‌ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహంత్‌ నరేంద్రగిరిది ఆత్మహత్యా, లేక హత్యా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు స్వామిజీ ఓ వీడియో రికార్డు చేశారన్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నారు.. ఆశ్రమానికి సంబంధించిన శిష్యుడు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు..

మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మహారాజ్‌ ఇంట్లో లభించిన 8 పేజీల సూసైడ్‌ నోట్‌ను ఆయనే రాశారా.. అందులో ఉన్నది ఆయన రైటింగేనా, లేక మరెవరైనా రాశారా అన్నదానిపై కూపీ లాగుతున్నారు. మహారాజ్‌ ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మహంత్‌ నరేంద్రగిరిది ఆత్మహత్య కాకపోతే.. ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు ఆయనను చంపాల్సి వచ్చింది? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Modi US Tour : ప్రధాని మోడీ అమెరికా పర్యటన షెడ్యూల్‌ ఖరారు

మహారాజ్‌ తన సూసైడ్‌ నోట్‌లో భూ మాఫియా పేరును కూడా ప్రస్తావించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఆ దిశగానూ పోలీసుల విచారణ కొనసాగుతోంది. 8 పేజీల సూసైడ్‌ నోట్‌లో ఆశ్రమం తదనంతరం ఎవరు చూసుకునే అంశాన్ని మహారాజ్‌ అందులో ప్రస్తావించారు. తన శిష్యుడైన ఆనంద్‌గిరీ పేరుతోపాటు.. గురూజీ ఆద్య తివారీ, అతని కుమారుడు సందీప్‌ పేరు కూడా ఆయన నోట్‌లో రాసినట్టుగా తెలుస్తోంది. వీరి ముగ్గురినే పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మానసికంగా కృంగిపోయానని, అందుకే తనువు చాలిస్తున్నట్టు ఆ లేఖలో నరేంద్రగిరి రాసినట్టుగా ఉంది. తన శిష్యుల్లో ఆనంద్‌గిరి, మరికొందరి తీరుపట్ల మనస్తాపానికి గురయ్యానంటూ అందులో ఉన్నట్టు తెలుస్తోంది. శిష్యులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా మహారాజ్‌ సూసైడ్‌ నోట్‌లో ప్రస్తావించారు. మానసికంగా మహారాజ్‌ కృంగిపోవడానికి కారణాలు ఏంటన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ టెస్టుల రిపోర్ట్‌ వచ్చిన తర్వాత మహారాజ్‌ మృతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

107 years twin sisters: ప్రపంచంలోనే వృద్ధ కవలలు..గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

సూసైడ్‌ నోట్‌లో నరేంద్రగిరి ప్రస్తావించిన ఆనంద్‌గిరి అనే శిష్యుడిని పోలీసులు ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే గురూజీ ఆత్మహత్య చేసుకోలేదని, ఆయనతో తాను 15 రోజుల క్రితం మాట్లాడినట్టు ఆనంద్‌గిరి తెలిపారు. డబ్బు కోసం ఆయనను కొందరు వేధించారని, తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ కుట్రలో పోలీసులు, ల్యాండ్‌ మాఫియా భాగస్వాములని, విచారణకు సహకరిస్తానని తెలిపారు. తాను తప్పు చేసినట్టుగా తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆనంద్‌గిరి తెలిపారు. మొత్తానికి దేశంలో సాధువులకు సంబంధించిన అతిపెద్ద సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడి మరణం మిస్టరీగా మారింది.

మహంత్ నరేంద్ర గిరి ఇక లేరనే వార్త విషాదం నింపినట్టు ప్రధాని మోదీ ట్వీట్‌లో సంతాపం తెలిపారు. నరేంద్ర గిరి స్వామీజీ మరణం తీరని లోటన్నారు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌. ఆయన ఆత్మకు శాంతి, ఆయన శిష్యులకు మనోనిబ్బరం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అన్నారు.