30ఏళ్ల నుంచి ఆ రాష్ట్రం తరుపున ముస్లీం ఎంపీ లేరు

దశాబ్దాలపాటు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న గుజరాత్‌లో గత 30ఏళ్లుగా ఒక్క ముస్లీం కూడా లోక్ సభకు వెళ్లలేదు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 07:14 AM IST
30ఏళ్ల నుంచి ఆ రాష్ట్రం తరుపున ముస్లీం ఎంపీ లేరు

దశాబ్దాలపాటు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న గుజరాత్‌లో గత 30ఏళ్లుగా ఒక్క ముస్లీం కూడా లోక్ సభకు వెళ్లలేదు.

దశాబ్ధాలపాటు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న గుజరాత్‌లో గత 30ఏళ్లుగా ఒక్క ముస్లీం కూడా లోక్ సభకు వెళ్లలేదు. ఎన్నో ఏళ్లుగా దేశ వ్యాప్త పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన గుజరాత్‌లో సామాజిక అణిచివేత, దౌర్జన్యాలకు ఎక్కువగా బలైన ముస్లీం సమాజం, తన కోసం పడికిలి బిగించి, గొంతెత్తి నినదించే నాయకత్వాన్ని మాత్రం తయారు చేసుకోలేదు. తరతరాలుగా పాలకుల వివక్ష, మెజార్టీల అణిచివేతకు గురవుతున్న ముస్లీంలు.. గుజరాత్ జనాభాలో 10 శాతం ఉన్నారు. దళితుల కంటే ఎక్కువగా, పటేళ్లతో పోలిస్తే కొంచెం తక్కువగా అక్కడ ముస్లీం జనాభా ఉంది. 

అయిననప్పటికీ కూడా ముస్లీంలు 30ఏళ్లుగా రాష్ట్రం నుంచి ఒక్కసారి కూడా లోక్ సభకు ఎన్నిక కాలేకపోవడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా చిన్నాభిన్నం అయిన ముస్లీం సమాజం.. 1965, 1985, 2002 మతకలహాలతో మరింత ధీన స్థితికి దిగిపోయింది. ప్రభుత్వాల చిన్నచూపు, ఆధిపత్యంతో గుజరాత్‌లో ముస్లీలంలు నిలదొక్కుకునే అవకాశమే లేకుండా పోయింది. గుజరాత్‌లో హార్దిక్ పటేల్, జిగ్నేశ్ మేవాని, అల్పేశ్ ఠాకూర్ వంటి వ్యక్తులు వారి వారి సమాజం కోసం పోరాటంలో నిలవగా.. ముస్లీంల నుంచి మాత్రం అటువంటి వ్యక్తులు లేక ముస్లీంలకు నాయకత్వం లేక ఇంకా వాళ్లు వెనుకపడే ఉన్నారు. 
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ

ఇదిలా ఉంటే 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మద్‌ పటేల్‌.. బహ్రెచ్‌ నియోజకవర్గం నుంచి గెలుపొంది పార్లమెంటుకు వెళ్లారు. 1977, 1982, 1984లో బహ్రెచ్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌ గెలుపొందిన అహ్మద్ పటేల్.. 1989 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చందు దేశ్‌ముఖ్‌పై పోటీ చేసి ఓడారు. నాటి నుంచి నేటి వరకూ పార్లమెంట్‌కు ఒక్కరు కూడా వెళ్లలేదు. 2014 సాధారణ ఎన్నికల వరకు ఏడుగురు ముస్లీం అభ్యర్థులు గుజరాత్‌ రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా గెలువలేదు. గుజరాత్‌ జనాభాలో 10శాతం ముస్లింలలో అక్షరాస్యత 80 శాతం ఉంది.

1962లో బనస్‌కాంత నియోజకవర్గం నుంచి ముస్లిం నాయకుడు జోహ్ర చవ్‌డా గెలుపొందారు. 1977లో బహ్రెచ్‌ నుంచి అహ్మద్‌ పటేల్‌, అహ్మదాబాద్‌ నుంచి యోహ్‌సన్‌ జఫ్రి గెలిచారు. అయితే బహ్రెచ్‌ నియోజకవర్గంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉంటుంది. ఇక్కడ 15.64 లక్షల ఓటర్లు ఉండగా.. ముస్లిం ఓటు బ్యాంకు 22.2 శాతం. అయినప్పటికీ 1989 నుంచి ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి గెలవడం లేదు. 2014 సాధారణ ఎన్నికల్లో గుజరాత్‌లో 334 మంది అభ్యర్థులు పోటీ పడగా.. ఇందులో 67 మంది ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున ఒకరు పోటీ చేయగా, మిగతా 66 మందిలో కొందరు చిన్నచిన్న పార్టీల నుంచి, ఇంకొందరు స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీ చేయలేదు.
Read Also : పవర్‌లోకి వస్తే ఈసీని జైలులో పెడుతా: బీఆర్‌.అంబేద్కర్ మనవడు