IIT Kanpur : థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు..వస్తే అంత తీవ్రత ఉండకపోవచ్చు

థర్డ్ వేవ్‌ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి...ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.

IIT Kanpur : థర్డ్ వేవ్ వచ్చే అవకాశం లేదు..వస్తే అంత తీవ్రత ఉండకపోవచ్చు

Iit Kanpur

Corona Third Wave : దేశంలో కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌తో జనం అల్లాడిపోయారు. ఆసుపత్రుల్లో చికిత్స కోసం బెడ్లు సరిపోలేదు. ప్రాణ వాయివు సంకటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే థర్డ్‌ వేవ్‌ ముప్పు అంతకంటే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. దీంతో థర్డ్ వేవ్‌ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి…ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.

Read More : Rains In Maharashtra : మహారాష్ట్రలో వర్షం బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన ఆవులు

థర్డ్‌ వేవ్‌ ప్రభావం వచ్చే అవకాశం లేదని…ఒక వేళ వస్తే అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెప్పారు. ఇప్పటికే రెండు దశలను భారత్ తట్టుకోగలిగిందని..మూడో దశను నిలువరిస్తుందని చెప్తున్నారు. థర్డ్ వేవ్‌ ప్రజల ఆరోగ్యంపై అంత తీవ్రంగా ప్రభావం చూపకపోవచ్చని అంచనా వేశారు. వైరస్ సంక్రమణ తక్కువగా ఉంటుందని…భయపడాల్సిన అవసరం లేదన్నారు ఐఐటీ కాన్ఫూర్ పరిశోధకులు. ఒక వేళ ఉధృతి పెరిగినా…సెకండ్‌ వేవ్‌ కంటే కేవలం ఒక శాతం ఎక్కువ మాత్రమే ప్రభావం చూపగలదని వివరించారు.

Read More : KRMB : ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ

సెకండ్‌ వేవ్‌లో డెల్టా వేరియంట్ విజృంభిచడంతో వైరస్ ప్రభావం ఎక్కువగా చూపింది. కొత్త వేరియంట్లు దాడి చేసినప్పటికీ తట్టుకోగలిగారని…రోగనిరోధక శక్తి పెరగడంతో ముప్పు తక్కువగా ఉంటుందంటున్నారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. టీకాలు తీసుకున్న వారిలో యాంటీబాడీలు డెవలప్ అవడంతో థర్డ్‌ వేవ్ వైరస్ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందంటున్నారు పరిశోధకులు. వ్యాక్సినేషన్ అనుకున్న టార్గెట్ రీచ్ అయితే థర్డ్‌ వేవ్‌కు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు.