HC : పుట్టుకలో పిల్లల తప్పు ఉండదు..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండదు

‘పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండరని ఓ కేసు తీర్పు విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది.

HC : పుట్టుకలో పిల్లల తప్పు ఉండదు..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండదు

Karnataka Hc

There is no illegal Children says Karnataka HC : పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని..అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో..కానీ అక్రమ సంతానం ఉండరని ఓ కేసు తీర్పు విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలుచేసింది. ఓ కేసు విషయంలో
రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే విషయంపై హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి.నగరత్న మరియు జస్టిస్ హంచేట్ సంజీవ్‌కుమార్ల డివిజన్ బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ..అక్రమ సంతానం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. పుట్టుక విషయంలో పిల్లల తప్పు ఉండదని కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..ఎలెక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌తో లైన్‌మన్ గ్రేడ్ -2 గా పని చేస్తున్న ఒక వ్యక్తి 2014లో జూన్ లో మరణించాడు. ఈ క్రమంలో అతని ఉద్యోగాన్ని తనకు ఇవ్వాలని మృతుడి రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేశారు. దీంతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని..కాబట్టి రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం కుదరదని బెస్కాం తెలిపింది. దీంతో రెండో భార్య కుమారుడు హైకోర్డును ఆశ్రయించాడు.

ఈ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. ఆ తరువాత ఈ కేసు డివిజన్ బెంచ్ కు వెళ్లింది.దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. తల్లిదండ్రులు లేకుండా పిల్లలు ఎలా పుడతారని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ‘అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమో కానీ, అక్రమ సంతానం ఉండదని..పుట్టుకలో పిల్లలు తప్పు ఉండదని కోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం మృతుడి రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని బెస్కాంకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, చట్టబద్ధమైన వివాహాలకు వెలుపల జన్మించే చిన్నారుల భవిష్యత్తుకు రక్షణ ఎలా కల్పించాలనే విషయం గురించి పార్లమెంటు ఆలోచించాలని ఈ సందర్భంగా సూచించింది.