ఐదేళ్లలోపే గ్రాట్యుటీ అమౌంట్ తీసుకోవచ్చు!

ఐదేళ్లలోపే గ్రాట్యుటీ అమౌంట్ తీసుకోవచ్చు!

ఐదేళ్లు నిండకుండానే ఉద్యోగులు గ్రాట్యూటీ అమౌంట్‌ను పొందొచ్చు. లోక్ సభలో ప్రవేశపెట్టిన 2019 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ బిల్లు ప్రకారం.. ఉద్యోగులు ఐదేళ్లు పనిచేసి జాబ్ విడిచి వెళ్లే సమయంలో గ్రాట్యుటీ అమౌంట్ తీసుకోవచ్చు. ఐదేళ్ల పాటు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తిస్తుంది. ఉద్యోగులను బట్టి గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఉంటాయి.

కొత్త బిల్లు ప్రకారం.. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరుతుంది. పదవీకాలం ఐదేళ్లు ఉండాల్సిన అవసరం లేదు. నెలవారీ జీతం, ఆక్రమణ నుంచి భద్రత, ఆరోగ్యం, పని చేసే పరిస్థితులు, సోషల్ సెక్యూరిటీ అనే అంశాల ప్రాధాన్యంగా రూపొందించారు. ఇందులో ఏ ఉద్యోగి అయినా ఐదేళ్ల కంటే తక్కువ కాలం ఉద్యోగం చేసి తప్పుకున్నా గ్రాట్యూటీ ఇవ్వాలనుంది. 

ఉద్యోగి చనిపోయినా, రాజీనామా, పదవీ విరమణ, యాక్సిడెంట్ ల కారణంగా అవయవాలు కోల్పోయినా, కోలుకోలేని జబ్బుతో బాధపడుతున్నా, కాంట్రాక్ట్ ను మధ్యలో వదిలేసుకున్నా డబ్బులు తీసేసుకోవచ్చు. కానీ, వీటన్నిటినీ ధ్రువీకరిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు ఉన్న సర్టిఫికేట్ సబ్‌మిట్ చేయాలి. 

ఒకవేళ ఉద్యోగి మరణిస్తే నామినీ వ్యక్తికి గ్రాట్యుటీ అమౌంట్ ఇస్తారు. ఆ ఉద్యోగి నామినేషన్ లో ఎవరి పేరు ఇవ్వకపోతే వారసులకు అందజేస్తారు. ఉద్యోగి ఆరు నెలలు లేదా సంవత్సరం పనిచేసి మానేసినా అతనికి 15రోజుల జీతాన్ని గ్రాట్యుటీ అమౌంట్ గా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.