ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి.. విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన

విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది. 

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2019 / 01:03 PM IST
ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి.. విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన

విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది. 

విమానంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఓ పార్టీ మాజీఅధ్యక్షుడుని పోలీసులు అరెస్ట్ చేశారు.తమిళనాడులోని మధురై ఎయిర్ పోర్ట్ లో శనివారం (మార్చి-30,2019)ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB)కి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలు నిరసనకు దిగారు.మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్‌ గా మార్చాలని వారు నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.నినాదాలు చేసినవారిలో భారతీయ ఫార్వార్డ్ బ్లాక్ మాజీ ప్రెసిడెంట్ మురుగన్‌ కూడా ఉన్నారు.
Read Also : బీజేపీ, కాంగ్రెస్ దుకాణాలు బంద్ : సీఎం కేసీఆర్

విమానం మధురై ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకోగానే, నినాదాలకు దిగిన మురుగన్, ఏఐఎఫ్‌ బీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మురుగన్‌ తో సహా పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు.2006లో భారతీయ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ లో విలీనం అయిన విషయం తెలిసిందే

ముత్తురామలింగది థేవార్‌ సామాజికవర్గం. మాజీ పార్లమెంట్‌ సభ్యుడు.1963లో మరణించిన ఆయనను థేవార్‌ కులస్థుల ఆరాధ్య నాయకుడిగా చెప్తుంటారు. మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్‌గా మార్చాలని గతంలో మురుగన్, తమిళనాడు ప్రభుత్వాన్ని పలుమార్లు కలిసి విజ్ణప్తి చేశారు. 
Read Also : ఓ హాస్పిటల్.. 9మంది నర్సులు.. ఒకేసారి ప్రెగ్నెన్సీ