Haryana : కరోనా వ్యాక్సిన్ లను దొంగిలించాడు..మళ్లీ తిరిగిచ్చేశాడు

ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ లను దొంగిలించి..మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Haryana : కరోనా వ్యాక్సిన్ లను దొంగిలించాడు..మళ్లీ తిరిగిచ్చేశాడు

Thief Steals

Thief Returns Covid Vaccine : కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం వ్యాక్సినేషనల్ పంపిణీ ప్రక్రియను జోరుగా చేపడుతోంది. అయితే..కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ దొరక్కపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల అవసరాలను అవకాశంగా మలచుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సిన్ లను అక్రమంగా తరలిస్తూ..ఇతరులకు విక్రయిస్తూ..భారీగా దోచేసుకుంటున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.

తాజాగా..ఓ వ్యక్తి వ్యాక్సినేషన్ లను దొంగిలించి..మరలా తిరిగి ఇచ్చేశాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది. జింద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్ట్రాంగ్ రూమ్ కు ఉన్న నాలుగు తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. దీంతో వైద్యులకు అనుమానం కలిగింది. అందులో ఉన్న కరోనా వ్యాక్సిన్ లు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగానే..జింద్ లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న టీ కొట్టుకు ఓ వ్యక్తి వచ్చి..ఓ బాక్స్ ఇచ్చాడు.

తాను పోలీసులకు ఆహారం అందిస్తుంటానని, వేరే పని ఉందని..అందుకే ఈ పెట్టెను పోలీసులకు ఇవ్వాలని చెప్పి..అక్కడి నుంచి ఆ వ్యక్తి జారుకున్నాడు. ఈ పెట్టెను పోలీసులకు అందించాడు టీకొట్టు వ్యక్తి. పోలీసులు ఆ పెట్టెను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. 440 కోవాగ్జిన్, 182 కొవిషీల్డ్ టీకా డోసులున్నాయి. అందులోనే ఓ ఉత్తరం కూడా కనిపించింది. క్షమించండి..ఇవి కరోనా టీకాలు అని నాకు తెలియదు..అని రాసి ఉంది. కరోనా చికిత్సలో వాడే రెమిడిసివర్ ఇంజెక్షన్లుగా భావించి..ఆ పెట్టెను ఎత్తుకెళ్లి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

Read More : Minister KTR : మంత్రి కేటీఆర్ కు కరోనా