Shiv Temple : గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్

గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే..

Shiv Temple : గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్

Thief Returns Money Stolen From Shiv Temple

thief returns money stolen from Shiv Temple : దొంగల్లో మంచి దొంగలు కూడా ఉంటారా? చోరీలు చేసిన దొంగలు పశ్చాత్తాపపడతారా? దొంగ సొమ్ముతో ఏం సుఖపడతాం? అని ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటారా? అంటే మేం కూడా అందరిలా సాధారణ మనుషులమే..మాకు కూడా పుణ్యం,పాపం తెలుస్తుంది అంటున్నాడో దొంగ. గుడి హుండీని దోచేసి ఆపై పశ్చాత్తాప పడ్డాడు. దోచుకున్న సొమ్ముని తిరిగి ఇచ్చేసి..అలా తాను ఎందుకు తిరిగి ఇచ్చేస్తున్నానో తెలుపుతో ఓ లెటర్ కూడా రాసి హుండీలో వేశారు. ఆ లెటర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also raed : Thief: పోలీస్ ఇంట్లో దొంగతనం.. లేఖ రాసిపెట్టిన దొంగ.. ఫ్రెండ్ కోసమే!

చెన్నైలోని రాణి పేట జిల్లా లాలాపేట సమీపంలోని కాంచనగిరి కొండ (శివాలయం)ఆలయంలో జూన్ 17న అర్దరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ హుండీ పగల గొట్టి నగదు అంతా దోచుకుపోయాడు. ఈ చోరీపై ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల తరువాత హుండీలో నగదు లెక్కించే కార్యక్రమం చేపట్టా ఆలయ నిర్వాహకులు. జూన్‌ 22 మంగళవారం రోజున హుండీ తెరిచారు. అందులో ఓ లేఖ ఉంది. దాన్ని ఎవరైనా భక్తులు వేశారేమో అనుకున్నారు మొదట. కానీ లెటర్ చదివాక తెలిసింది అసలు విషయం. ఆ లెటర్ ఆ గుడిలో చోరీకి పాల్పడిన దొంగ రాసిన లేఖగా గుర్తించారు అధికారులు.

Also raed : క్షమించండి…ఆకలి తీర్చుకోటానికి దొంగతనం చేశాను….చోరీ చేసి లేఖ వదిలి వెళ్లిన దొంగ

ఆ లేఖలో ఏముందంటే…“నన్ను క్షమించండి. నేను చిత్ర పౌర్ణమి ముగిసిన కొన్ని రోజుల అనంతరం ఆలయ హుండి పగలగొట్టి నగదు చోరీ చేశాను. అప్పటి నుంచి నాకు మానసిక ప్రశాంతత లేకుండాపోయింది. నా కుటుంబంలోనూ గతంలో ఎన్నడూ లేని సమస్యలన్ని వచ్చిపడ్డాయి. నేను హుండీలో చోరీ చేసిన రూ .10 వేల నగదును మళ్ళీ వేస్తున్నాను. నన్ను క్షమించండి. దేవుడు కూడా క్షమిస్తాడు అని ఆశిస్తున్నాను. అని రాసిన లేఖతో పాటు 500 నోట్లతో కూడిన రూ. 10 వేలు జతచేసి ఉంది.ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.