Uttar Pradesh : చోరీ చేసిన సొమ్ము ఎక్కువగా ఉండడంతో దొంగకు గుండెపోటు

డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో ఓ దొంగకు గుండెపోటుకు వచ్చింది. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.

Uttar Pradesh : చోరీ చేసిన సొమ్ము ఎక్కువగా ఉండడంతో దొంగకు గుండెపోటు

Bijnor

Thief Suffers Heart Attack : కొంతమంది వెరైటీ దొంగలు ఉంటారు. దొంగతనానికి వచ్చి తమకిష్టమైన ఫుడ్ ఏదైనా ఉంటే..దానిని తినేసి ఎంచక్కా జారుకుంటుంటారు. మరికొంతమంది అయితే..చోరీ కోసం వచ్చి..కునుకు తీస్తుంటారు. ఇలాగే…ఓ వ్యక్తి చోరీ చేశాడు. అయితే…డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో గుండెపోటుకు గురయ్యాడు. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దోచిన సొమ్ములో చాలా వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చోరీ చేసిన వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బిజ్నోర్ జిల్లాలో కొత్వాలి దేహ్త్ ప్రాంతంలోని ప్రజా సేవ కేంద్రంలో ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. అనంతరం అక్కడున్న డబ్బును దొంగిలించుకపోయారు. కేంద్ర నిర్వాహకుడు నవాబ్ హైదర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ. 7 లక్షలు పోయినట్లు కంప్లయిట్ చేశాడు. నాగినా పీఎస్ పరిధిలో ఆలీపూర్ ప్రాంతంలో 2021, మార్చి 31వ తేదీ బుధవారం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నౌషాద్, ఎఝాజ్ అనే వ్యక్తులుగా గుర్తించారు. వీరిని విచారించగా..చోరీ చేసిన విషయం బయటపడింది. ఇటీవలే ఓ ప్రాంతంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. అయితే..ఊహించినదానికన్నా..పెద్ద మొత్తంలో దోచిన డబ్బును చూసి తమలో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చిందన్నారు. దోచిన సొమ్ములో చాలా వరకు వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. అనంతరం పోలీసులు రూ. 3.7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Read More : Bangkok : నడి రోడ్డుపై కుక్క కోసం బస్సును ఆపిన డ్రైవర్