Thieves who said ‘Sorry Krishna’ : ‘సారీ’ కృష్ణుడు ముందే నగలు చోరీ చేయలేకపోయాం..చీటీ రాసిపెట్టిన దొంగలు

నగల షాపులో చోరీకి వచ్చిన దొంగలు షాపులో ఉన్న కృష్ణుడు విగ్రహం చూసి ‘సారీ’ కృష్ణుడు ముందే నగలు చోరీ చేయలేకపోయాంఅని చీటీ రాసిపెట్టి పోయారు. 15 అడుగుల సొరంగం తవ్వి మరీ చోరీకి వచ్చిన దొంగలు కృష్ణుడు విగ్రహంచూసి చోరీ చేయకుండానే వెనుతిగిరిపోయారు.

Thieves who said ‘Sorry Krishna’ : ‘సారీ’ కృష్ణుడు ముందే నగలు చోరీ చేయలేకపోయాం..చీటీ రాసిపెట్టిన దొంగలు

Thieves who said ‘Sorry Krishna’

Thieves who said ‘Sorry Krishna’ : నగల షాపులో చోరీ చేయటానికి వచ్చిన దొంగలకు ‘పాపభీతి’కలిగింది. పాపం నగలు ఎత్తుకెళ్లటానికి వచ్చి షాపులో ఉన్న ‘కృష్ణుడు’విగ్రహం కూడా భయపడ్డారు. నవనీత చోరుడు..గోపికల వస్త్రాలు దొంగిలించిన ‘దొంగ కిట్టయ్య’ బొమ్మను చూసి దొంగలు చోరీ చేయటానికి కాస్త సంకోసించారు. నగలు దోచుకెళ్లటానికి వచ్చినవారు వచ్చిన పనిచూసుకోకుండా ‘కృష్ణుడు’విగ్రహం చూసి కాస్త వెనకడుగు వేశారు. చోరీ చేయటానికి దొంగలకు మనస్సొప్పలేదు. దీంతో ‘సారీ’అని ఓ చీటీమీద రాసి దాన్ని కృష్ణుడు విగ్రహం ముందు పెట్టి గుట్టు చప్పుడు కాకుండా చల్లగా అక్కడినుంచి జారుకున్నారు.షాపులోకి ప్రవేశించేందుకు దొంగలు కష్టపడి 15 అడుగుల పొడవున్న సొరంగాన్ని తవ్వి మరీ షాపులోకి ఎంటర్ అయ్యాక షాపులో ఉన్న కృష్ణుడి విగ్రహం చూసి వచ్చినదారినే వెళ్లిపోయారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌‌‌లో జరిగిన ఈ వింత ఘటన గురువారం (ఫిబ్రవరి2,2023)న వెలుగులోకి వచ్చింది. గురువారం ఉదయం ప్రతీరోజులానే షాపు తెరిచిన యజమని దీపక్ షాపులో చోటు చేసుకున్న తేడాలను గుర్తించారు. దొంగలు చొరబడ్డారని గుర్తించారు. కృష్ణుడు విగ్రహం ఎప్పటిలా కాకుండా విగ్రహం గోడవైపుకు తిరిగి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఏదో జరిగిందని గుర్తించారు. దీంతో దీపక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వచ్చిన పోలీసులు షాపుతో పాటు పరిశరాలను పరిశీలించారు.

షాపు సమీపంలోని నాలా నుంచి షాపులోకి ప్రవేశించేందుకు ఏకంగా 15 అడుగుల పొడవున్న సొరంగాన్ని తవ్వినట్లుగా గుర్తించారు. షాపులోకి వచ్చి కూడా నగల చోరీ జరగకపోవటంతో పోలీసులు కూడా ఆశ్యర్యపోయారు. కృష్ణుడు విగ్రహం గోడవైపుకు తిరిగి ఉండటం..విగ్రహం వద్ద ‘సారీ’ అని ఓ చిట్టీపై రాసిపెట్టి వెళ్లిపోవటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

ఇక కృష్ణుడి విగ్రహం గోడవైపునకు తిరిగి ఉండటాన్ని బట్టి.. దొంగలు దేవుడి ముందు చోరీ చేసేందుకు భయపడి విగ్రహాన్ని గోడవైపు తిప్పి ఉంటారని షాపు యజమాని అభిప్రాయపడ్డారు. పోలీసులు మాత్రం వారి పనివారు చేసుకుపోయారు. షాపులోని సీసీ టీవీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, ఫుటేజీని తమతో తీసుకెళ్లిపోయారు. షాపు పరిసర ప్రాంతాల్లోని సీసీకెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను చిన్నూ, మున్నూగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునే పనిలో పడ్డారు.