Monkeypox: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. కేర‌ళ‌లో మూడ‌వ కేసు న‌మోదు

దేశంలో మూడవ‌ మంకీపాక్స్ కేసు న‌మోదైంది. కేర‌ళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్య‌క్తికి ఆ వైర‌స్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేర‌ళ రాష్ట్రంలోని మ‌ల్ల‌పురం వ‌చ్చిన వ్య‌క్తిలో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అతడు తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న క్ర‌మంలో మాన్ జెర్రీ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Monkeypox: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. కేర‌ళ‌లో మూడ‌వ కేసు న‌మోదు

Monkeypox

Monkeypox: కొవిడ్ మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ఉపిరిపీల్చుకుంటున్న ప్ర‌పంచ దేశాల‌ను మంకీపాక్స్ రూపంలో మ‌రో వైర‌స్ హ‌డ‌లెత్తిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టికే దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు న‌మోద‌య్యాయి. శుక్ర‌వారం కేర‌ళ రాష్ట్రంలో మ‌రో మంకీపాక్స్ పాజిటివ్ కేసు న‌మోదైంది. యూఏఈ నుంచి మ‌ల్ల‌పురం వ‌చ్చిన వ్య‌క్తికి మంకీపాక్స్ సోకిన‌ట్లు అధికారులు గుర్తించారు.

Monkeypox: రెండో మంకీపాక్స్ కేసు.. ఎయిర్‌పోర్టుల వద్ద కఠిన పరీక్షలకు కేంద్రం ఆదేశాలు

దేశంలో మూడవ‌ మంకీపాక్స్ కేసు న‌మోదైంది. కేర‌ళ రాష్ట్రంలో 35ఏళ్ల వ్య‌క్తికి ఆ వైర‌స్ సోకింది. జూలై 6న యూఏఈ నుంచి కేర‌ళ రాష్ట్రంలోని మ‌ల్ల‌పురం వ‌చ్చిన వ్య‌క్తిలో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అతడు తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న క్ర‌మంలో మాన్ జెర్రీ మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈనెల 15న ఆ వ్య‌క్తిలో మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ట్లు కేర‌ళ ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప‌రీక్ష‌ల అనంత‌రం మంకీపాక్స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింద‌ని, ఆ వ్య‌క్తితో స‌న్నితంగా ఉన్న‌వారిని, కుటుంబ‌స‌భ్యుల్ని అబ్జ‌ర్వేష‌న్‌లో పెట్టిన‌ట్లు మంత్రి చెప్పారు.

Monkeypox: దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..

జూలై 14న యూఏఈ నుంచి కేర‌ళ రాష్ట్రంకు వ‌చ్చిన వ్య‌క్తికి మంకీపాక్స్ నిర్ధార‌ణ అయిన విష‌యం విధిత‌మే. దీంతో దేశంలో మొట్టమొదటి కేసుగా అధికారులు గుర్తించారు. అతను తిరువనంతపురం మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాలో మంకీపాక్స్ రెండవ కేసు నమోదైంది. పరియారన్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన రోగి పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి జార్జ్ సూచించారు. ఇదిలాఉంటే ప్ర‌పంచ వ్యాప్తంగా 70కిపైగా దేశాల్లో 14వేల మంకీపాక్స్ కేసులు న‌మోదైన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) వెల్ల‌డించింది. ఈ మేర‌కు డ‌బ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధ‌నామ్ బుధ‌వారం తెలిపారు. మంకీపాక్స్ సోకిన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు.