Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్.. ఏడుగురు సీఎంలతో భేటీకి ఢిల్లీ సీఎం ప్రయత్నాలు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్లు తాజాగా వెల్లడైంది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్.. ఏడుగురు సీఎంలతో భేటీకి ఢిల్లీ సీఎం ప్రయత్నాలు

Arvind Kejriwal

Arvind Kejriwal: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార బీజేపీని ఎదుర్కొనే ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగా బీజేపీ రహిత, కాంగ్రెస్ రహిత ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Steve Smith: అద్భుతంగా క్యాచ్ పట్టిన స్మిత్.. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అంటున్న జహీర్ ఖాన్… వీడియో ఇదిగో!

ఈ విషయంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీకి చెందిన సమాజ్‌వాదీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ లేకుండానే ఫ్రంట్ ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ లేని థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏడుగురు సీఎంలకు కేజ్రీవాల్ గతంలో లేఖలు రాసినట్లు తాజాగా వెల్లడైంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ సహా మొత్తం ఏడుగురు సీఎంలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది.

PM Modi: పానీ పూరీ టేస్ట్ చేసిన ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని ఫ్యుమియో.. వీడియో వైరల్

ఈ నెల 18న ఆయా సీఎంలతో సమావేశం జరపాలని కేజ్రీవాల్ భావించారు. అయితే, దీనికి సీఎం కేసీఆర్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని తెలిపారు. కాగా, ఈ సమావేశంపై కేజ్రీవాల్ తరఫునుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోవైపు ఇతర పార్టీలు థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమేనని ప్రకటించింది.