మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎన్నోసారి అంటే?

  • Published By: vamsi ,Published On : November 12, 2019 / 01:06 PM IST
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎన్నోసారి అంటే?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను ఆమోదిస్తూ రాష్ట్రపతి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రపతి పాలన వెంటనే అమలులోకి వచ్చింది. శివసేన, బీజేపీలు కుర్చీ కోసం కొట్లాడుకోవడంతో… 50-50 ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో చివరకు గొడవల కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చర్చలు వేడెక్కిన సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే గవర్నర్ బిఎస్ కోశ్యారి సిఫారసు మేరకు రామ్ నాథ్ కోవింద్ ఆమోదించడంతో మహారాష్ట్రలో మంగళవారం(12 నవంబర్ 2018) రాష్ట్రపతి పాలనలోకి వచ్చింది. అక్టోబర్ 24న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా 15 రోజులైనా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడోసారి. 1980లో మొదటిసారి, 2014లో రెండోసారి రాష్ట్రపతి పాలన అమలైంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడోసారి. 1980లో మొదటిసారి, 2014లో రెండోసారి రాష్ట్రపతి పాలన అమలైంది. 1980 ఫిబ్రవరి 17 నుంచి 1980 జూన్ 8 వరకు 112 రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌కు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది.

ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు 33 రోజుల పాటు రెండోసారి రాష్ట్రపతి పాలన నడిచింది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్.. ఎన్సీపీ, ఇతరుల నుంచి విడిపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ అయింది. లేటెస్ట్‌గా మూడోసారి నవంబర్ 12 నుంచి మూడోసారి అమల్లోకి వచ్చింది.