Third Wave : ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండండి!

ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర దాకా కొత్త కేసులు నమోదవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

Third Wave : ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండండి!

Third Wave

Third Wave : ఇండియాలో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్యులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచనలు చేస్తున్నారు. కొత్తగా వేసిన అంచనాల ప్రకారం ఈ నెలలోనే థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని రోజూ లక్ష నుంచి లక్షన్నర దాకా కొత్త కేసులు నమోదవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. థర్డ్ వేవ్ పై హైదరాబాద్, కాన్పూర్‌ IITల్లోని పరిశోధకులు మతుకుమల్లి విద్యాసాగర్, మణీంద్ర అగర్వాల్ అంచనాలు వేసినట్లు బ్లూబ్‌బెర్గ్ తెలిపింది.

థర్డ్ వేవ్ అక్టోబర్ నెలలో తీవ్ర స్థాయికి చేరుతుందని వీరు వెల్లడించారు. కేరళ మహారాష్ట్రను చూస్తేనే థర్డ్ వేవ్ వచ్చేస్తోందనే విషయం అవగతమవుతోందని విద్యాసాగర్ బ్లూమ్‌బెర్గ్‌కి ఈమెయిల్ ద్వారా తెలిపారు. మేథమేటికల్ పద్దతి ద్వారా ఈ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఇండియాలో మొదటి వేవ్ ఎలా వచ్చింది, రెండో వేవ్ ఏ స్థాయిలో వచ్చింది, ఆ రెండింటి మధ్య ఎంత గ్యాప్ ఉంది. ఇలా అనేక కోణాల్లో ఆలోచించి రకరకాల గ్రాఫులు, లెక్కలు వేసి ఈ అంచనాలు చెప్పారన్నమాట..

వీరి అంచనాల ప్రకారం మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా కేసులు బాగా పెరుగుతాయని తెలుస్తుంది. అయితే ఏప్రిల్‌లో ప్రొఫెసర్ విద్యాసాగర్ టీమ్ జులై నెల మధ్యలో కరోనా కేసులు తీవ్ర స్థాయికి చేరతాయని అంచనా వేసింది. కానీ ఆ అంచనా తప్పైంది. దీనిపై విద్యాసాగర్ ట్విట్టర్‌లో స్పందించారు. కరోనా చాలా వేగంగా మార్పులు చెందుతోందనీ అందువల్ల అంచనాలు సవరించాల్సి వస్తోందని అన్నారు.

ఇక ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50 శాతం కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇక ప్రధానంగా ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంటే మళ్లీ మూడో వేవ్‌కి కూడా కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు విద్యాసాగర్. ప్రస్తుతం ఈ వేరియంటే అమెరికా, జపాన్, మలేసియా, ఇరాన్ ఇలా చాలా దేశాల్లో విజృంభిస్తోంది.