CSIR : థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. కానీ ఎప్పుడు, ఎలాగో చెప్ప‌లేం – శేఖ‌ర్ సీ మాండే

దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ్ రిసెర్చ్ (CSIR) డెరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ సీ మాండే తేల్చిచెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాండే దేశంలో కొవిడ్ థ‌ర్డ్ వేవ్‌ తప్పదని చెప్పారు.

CSIR : థ‌ర్డ్ వేవ్ ప‌క్కా.. కానీ ఎప్పుడు, ఎలాగో చెప్ప‌లేం – శేఖ‌ర్ సీ మాండే

Csir

CSIR : దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ్ రిసెర్చ్ (CSIR) డెరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ శేఖ‌ర్ సీ మాండే తేల్చిచెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మాండే దేశంలో కొవిడ్ థ‌ర్డ్ వేవ్‌ తప్పదని చెప్పారు.

అయితే ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అనే దానిపై మాత్రం మాండే స్పష్టత ఇవ్వలేదు. థర్డ్ వేవ్ ను ఎదురుకోవాలి అంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు.

కరోనా జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని కోరారు మాండే.. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోందన్న మాట నిజమే కానీ దాని ప్రభావం అంతగా ఉండదని.. భయపడాల్సిన పనిలేదని చెప్పారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకేల్లో థర్డ్ వేవ్ విస్తరిస్తుందని తెలిపారు.

మరికొన్ని దేశాల్లో ఫోర్ట్ వేవ్ కూడా వచ్చినట్లు వివరించారు. మ‌న దేశంలోకి ఎప్పుడు, ఎలా వ‌స్తుందో తెలియ‌ద‌ని, కాబ‌ట్టి మ‌నం చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మాండే సూచించారు. చిన్నపిల్లపై ప్రభావం చూపుతుంది అనే విషయాన్నీ ఆయన స్పష్టం చేయలేదు.