IIT Kanpur Study: సెప్టెంబర్‌లో మూడో వేవ్.. భయపెడుతోన్న నిపుణుల నివేదిక!

దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి.

IIT Kanpur Study: సెప్టెంబర్‌లో మూడో వేవ్.. భయపెడుతోన్న నిపుణుల నివేదిక!

Iit Kanpur Study

దేశంలో కరోనా కేసుల సంక్రమణ రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. ఎట్టకేలకు సెకండ్ వేవ్ తగ్గడంతో దుకాణాలు, మార్కెట్లు, సంస్థలు ముందు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా మూడో వేవ్ గురించి మాత్రం వస్తోన్న వార్తలు భయం పుట్టిస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్‌లకు ప్రాధాన్యత ఇస్తూ.. ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు. ఎటువంటి కారణం లేకుండా రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, ముసుగు ధరించకపోవడం, శారీరక దూరాన్ని పాటించకపోవడం మాత్రం మరోసారి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు కాన్పూర్ ఐఐటి నిపుణులు.

మూడో వేవ్ గురించి కాన్పూర్ ఐఐటి నిపుణుల అంచనా ప్రకారం.. వైరస్ మ్యుటేషన్ (రూపం మార్పు) రెండవ వేవ్ కంటే మరింత ప్రమాదకరంగా ఉంటుంది. సెప్టెంబరులో గరిష్ట సంఖ్యలో కేసులు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. కోవిడ్ నియమాలను పాటించకపోతే రోజులో ఐదు లక్షలకు పైగా సోకే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అక్టోబర్‌లో అత్యధిక సంఖ్యలో కేసులు వస్తాయని భావిస్తున్నారు. ఐఐటి ఫిజిక్స్ ప్రొ. మహేంద్ర వర్మ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. రాజేష్ రంజన్ మరియు అతని బృందం గణిత నమూనాల సహాయంతో మూడో వేవ్‌పై పరిశోధనలు చేస్తున్నారు.

ఐఐటి నిపుణులు అనేక రాష్ట్రాల్లో మూడో వేవ్ పరిస్థితులపై పరిశోధనలు చేస్తూ డేటా సేకరిస్తున్నారు. జనాభా, సోకినవారు, కరోనా మరణాలు మరియు కోలుకున్న వారి నివేదికలు తయారు చేస్తున్నారు. సెకండ్ వేవ్ వైరస్ ప్రవర్తన ఆధారంగా పరిశోధనలు జరిపినట్లుగా రాజేష్ రంజన్ చెప్పుకొచ్చారు. రెండవ వేవ్ కేసులను బట్టి, మూడో వేవ్‌ను మూడు విధాలుగా అంచనా వేస్తున్నారు.

జూలై 15వ తేదీ వరకు సెకండ్ వేవ్ మామూలు స్థితికి వస్తుంది. అప్పటినుంచి దేశంలో ప్రతిదీ తెరుచుకుని మామూలు పరిస్థితుల్లోకి వస్తుంది. జనవరి 2021లో మాదిరిగా ప్రజలు మళ్లీ జీవితాన్ని గడపడం స్టార్ట్ చేస్తారు. సెకండ్ వేవ్‌కు ముందు నివసిస్తున్నట్లు. ఈ పరిస్థితిలో, కరోనా వైరస్ పీక్ స్టేజ్ అక్టోబర్ మొదటి వారంలో రావచ్చు. సెప్టెంబర్ మధ్యలో వరకు రోజులో సుమారు మూడు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అక్టోబర్ మొదటివారంలో 5లక్షల కేసులు రోజుకు నమోదవ్వొచ్చు.

కోవిడ్ నియమాలను పాటించకుంటే, వైరస్ పరివర్తనం చెందినప్పుడు సెప్టెంబర్ 15నే పీక్ స్టేజ్ వస్తుంది. రోజుకు ఐదు లక్షల మందికి కరోనా సోకవచ్చు. కోవిడ్ నియమాలను బాగా పాటించడం ద్వారా.. కరోనా పీక్‌స్టేజ్ నవంబర్ 1న రావచ్చు. రోజుకు ఒకటిన్నర లక్షల కేసులు మాత్రమే వస్తాయి. మనం నిబంధనలు పాటించేదాన్ని బట్టి, మూడవ వేవ్ బలహీనపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిబంధనలు మెరుగ్గా పాటిస్తే లాక్‌డౌన్ అవసరం ఉండకపోవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.