Man Not Eaten Rice for 42 years : సీతమ్మపై రామయ్య అలక..భార్యమీద అలిగి 42ఏళ్లుగా అన్నం మానేసిన భర్త

భార్యమీద అలిగి 42ఏళ్లుగా అన్నం మానేసాడు ఓ భర్త. ఆ భర్త పేరు రామచంద్ర. భార్య సీత. సీతమీద అలిగి 42 ఏళ్లుగా అన్నం తినటం మానేశాడు భర్త.

Man Not Eaten Rice for 42 years : సీతమ్మపై రామయ్య అలక..భార్యమీద అలిగి 42ఏళ్లుగా అన్నం మానేసిన భర్త

Man Not Eaten Rice for 42 years

Man Not Eaten Rice for 42 years : త్రేతాయుగం రాముడు భార్య సీతమీద ఆటపట్టించటానికి కూడా అలగలేదు. కానీ ఒడిశాలోని ఓ రాముడు మాత్రం భార్య సీతమీద అలిగాడు. అలిగి అన్నం తినటం మానేశాడు. అలా ఒకరోజు రెండు రోజులు కాదు. 42 ఏళ్లుగా అన్నం తినటం మానేశాడు రామచంద్ర అనే భర్త. అతని భార్య పేరు సీత. భార్య సీతమీద అలిగిన రామచంద్ర 42 ఏళ్లుగా అన్నం తినటం మానేశాడు. అలా అని బయట కూడా ఏమీ తినడు..మరి ఎలా జీవిస్తున్నాడంటారా? బతకాలంటే ఏదోకటి తినాలి,తాగాలిగా..భార్య సీత మీద అలిగి 42 ఏళ్లుగా అన్నం తినటం మానేసిన భర్త రాముడు కేవటం టీ తాగుతాడు. అటుకులు తింటు జీవిస్తున్నాడు. ఓ విషయంలో జరిగిన గొడవ ఇంత కథకు దారి తీసింది..

జైపుర్‌ జిల్లాలోని వికీపుర్‌ గ్రామానికి చెందిన 76 ఏళ్ల రామచంద్రకు 22 ఏళ్ల వయసులో సీత అనే యువతితో వివాహం జరిగింది. రామచంద్ర కూలి పనుల చేస్తుంటాడు. పనులు లేనప్పుడు ఎండుచేపలు అమ్ముతుంటాడు. అలా వారి కుటుంబం జీవనం సాగించేవారికి ఐదురుకు కూతుళ్లు, ఇద్దరు కొడుకు ఉన్నారు. వారందరికి వివాహాలు అయిపోయాయి. అలా పేదరికంలో ఉన్నా..ఇద్దరు సీతారాముల్లాగనే కలిసి కాపురం చేశారు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఈక్రమంలో 42 సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్నగొడవ జరిగింది. ఓ రోజు రామచంద్ర కూలిపనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు. అన్నం పెట్టమని భార్యను అడిగాడు. కానీ ఆమె ఇంటిపనులతోను బయటపనులతోను అలసిపోయి అనారోగ్యంగా ఉండి వంట చేయలేదని చెప్పింది. దీంతో రామచంద్రకు కోపం బుస్సున పొంగుకొచ్చింది.

భార్య పరిస్థితిని అర్థం చేసుకోని రామచంద్ర.. తినడానికి అన్నం పెట్టలేదని ఆమెపై ఆగ్రహించాడు. ఇకనుంచి నేను అన్నం ముట్టను..నీచేత్తో ఒక్క అన్నం మెతుకు కూడా ముట్టను అసలు అన్నమే తినను అంటూ చెప్పి బయటకు వెళ్లిపోయాడు. కోపంలో అన్నాడు కదా తినకపోతాడా? అని అనుకుంది సీత. కానీ రామచంద్ర భీష్మ ప్రతిజ్ఞచేశాడని అలా ఇక అన్నం తినటం మానేస్తాడని అస్సలు ఊహించలేదు పాపం ఆ పిచ్చి సీత. కానీ రామచంద్ర మాత్రం అప్పటినుంచి ఇప్పటి వరకు అన్నం తినటం మానేశాడు. అంతేకాదు భార్యమీదకోపంతో వారి ఇంటిముందే ఓ గుడిసె వేసుకుని అక్కడే జీవిస్తున్నాడు.

రామచంద్రకు భార్య సీత ఎంతగానో నచ్చ చెప్పింది. ఇంకెప్పుడు అలా చేయనని అన్నం తినమని బతిమిలాడింది.ఏడ్చింది. కానీ రామచంద్ర వినలేదు. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు అల్లుళ్లు బంధువులు చాలామంది నచ్చచెప్పారు. తిరిగి గతంలోగానే ఉండమని. కానీ రామచంద్ర వినలేదు. భార్యచేతి అన్నం తినటంలేదు. ఆమె కొడుకులు కోడళ్లతో కలిసి ఉంటోంది. వారి ఇంటి ఎదురుగా వేసుకున్న గుడిసెలో రామచంద్ర ఉంటున్నాడు. భార్య చేతి అన్నం తినకపోయినా రామచంద్ర తన రోజువారి సంపాదనలో కొంత భార్యకు ఇస్తుంటాడు. అలా అప్పటినుంచి భార్య సీత బతిమాలినా అన్నం మాత్రం తిననంటూ అలాగే ఉండిపోయాడు రామచంద్ర. కేవలం టీ తాగుతు అటుకులు మాత్రం తింటున్నాడు.