ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీలో బెంగళూరు టాప్

ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీలో బెంగళూరు టాప్

Ease Of Living ఈజ్​ ఆఫ్​ లివింగ్(జీవన సౌలభ్యం)​ సూచీలో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్(EoLI)మరియు మున్సిపల్ ఫర్ఫార్మెన్స్ ఇండెక్స్(MPI)2020 ర్యాంకులను గురువారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి విడుదల చేశారు. దేశంలోని వేర్వేరు నగరాల్లో జీవనం సాగించేందుకు ఉన్న పరిస్థితులు ఆధారంగా కేంద్రం ఈ​ ర్యాంకులు ప్రకటించింది.

ఈజ్ ఆఫ్ లివింగ్ 2020లో భాగంగా దేశవ్యాప్తంగా 111సిటీలను పరిశీలించగా..ఇందులో బెంగళూరు టాప్ లో నిలిచింది. పుణె, అహ్మదాబాద్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. చెన్నై,సూరత్​, నవీ ముంబై,కోయంబత్తూర్​,వడోదరా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక, 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల ర్యాంకింగ్స్​లో సిమ్లా అగ్రస్థానం పొందింది. ఈ కేటగిరీలో భువనేశ్వర్ రెండవ స్థానంలో నిలవగా,సిల్వస్సా మూడో స్థానంలో నిలిచింది. 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న 62 సిటీల్లో ఈజ్ ఆఫ్ లింగ్ ఇండెక్స్ లో “ముజఫర్ నగర్”చివరిస్థానంలో నిలిచింది.

10 లక్షల కంటే తక్కువ జనాభాతో మంచి పనితీరు కనబర్చిన పురపాలికల జాబితాలో న్యూ ఢిల్లీ మొదటిస్థానం దక్కించుకుంది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండి మంచి పనితీరు కనబర్చిన పురపాలికల్లో.. ఇండోర్ తొలిస్థానలో నిలివగా,సూరత్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానా్లలో భోపాల్,పింప్రి చించ్వాడ్,పూణే,అహ్మదాబాద్,రాయ్ పూర్,గ్రేటర్ ముంబై,విశాఖపట్నంమరియు వడోడదా ఉన్నాయి.