One Daily Habit : ఒక్క అల‌వాటు చేసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ‌తికేయొచ్చు..

రోజువారీ నిద్రించే ప‌ద్ధ‌తుల‌తో దీర్ఘాయువుకు సంబంధం ఉంద‌ని ఓ ప‌రిశోధ‌నా నివేదిక వెల్ల‌డించింది. ఒక్క అలవాటుతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేయొచ్చు అంటున్నారు నిపుణులు.

One Daily  Habit : ఒక్క అల‌వాటు చేసుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ‌తికేయొచ్చు..

Sleep Well

The right sleeping time : ఎంతకాలం బ్రతికామని కాదు బ్రతికినంత కాలం ఎలా బ్రతికామనేది ముఖ్యం అని పెద్దలు అంటుంటారు. కానీ నేటి కాలంలో బతకటం అంటే అనారోగ్యాలతో బ్రతకటం కాదు. ఆరోగ్యంగా జీవించటం అనేది చాలా ముఖ్యం. కొన్ని చెడ్డ అలవాట్లు ఆయుషుని కూడా తగ్గించేస్తాయనే విషయం తెలుసా? మద్యం తాగటం, మాదక ద్రవ్యాల అలవాట్లే కాదు.. బద్దకం కూడా మనిషిని అనారోగ్యం పాలు చేస్తుందనే విషయం తెలుసుకోవాలి.అవగాహనం పెంచుకోవాలి. చెడ్డ అలవాట్లు ఆయుషుని తగ్గిస్తే మంచి అలవాటట్లు ఆయుషుని పెంచుతాయంటున్నారు పరిశోధకులు.

ముఖ్యంగా వ్యాయామం.మంచి నిద్ర, నిద్రలేచే సమయం, నిద్రపోయే సయమం ఇలా అన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు ఎలాంటి ర‌హ‌స్య ఫార్ములాలు లేవు. కానీ..దీర్ఘాయువుతో సుఖంగా బ‌తికాలంటే మాత్రం కొన్ని ఆరోగ్య‌క‌ర అలవాట్లు ఉప‌యోగపడాయంటున్నారు ప‌రిశోధ‌కులు.అదికూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే. మంచి అలవాట్లను చేసుకుంటే. ఒకేఒక్క జీవ‌న‌శైలి మార్పుతో దీర్ఘాయువు సాధ్య‌మ‌ని జ‌ర్న‌ల్ ఫ్రంటియార్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌నం వెల్ల‌డించింది. రోజువారీ నిద్రించే ప‌ద్ధ‌తుల‌తో దీర్ఘాయువుకు సంబంధం ఉంద‌ని ఈ ప‌రిశోధ‌నా నివేదిక వెల్ల‌డించింది.

ఎక్కువ కాలం జీవించిన వారిలో ఇత‌రులతో పోలిస్తే రోజూ స‌రైన స‌మ‌యంలో వారు నిద్ర‌ పోవటం, నిద్ర లేవటం వంటివి ఉన్నాయని తెలిపారు. అలా సరైన సమయంలో తగినంత సమయం నిద్రపోతే ఆరోగ్యం సంప్రాప్రిస్తుందని తేలింది. వీరిలో లిపిడ్ ప్రొఫైల్ (కొలెస్ట్రాల్ స్ధాయిలు) స‌రైన రీతిలో ఉంటుంద‌ని గుర్తించారు పరిశోధకులు. రోజూ ఏడు నుంచి ఎనిమిది గంట‌ల పాటు గాఢ‌నిద్ర‌, అంటే సుఖ నిద్ర కొలెస్ట్రాల్‌ను నియంత్ర‌ణలో ఉంచుకుంటే మనుషులు దీర్ఘ‌కాలం ఆరోగ్యంగా జీవించ‌వ‌చ్చ‌ని ఈ ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

అంటే..ప్రతీరోజూ ఒకే స‌మ‌యానికి నిద్ర‌ పోవటం, ఒకే స‌మ‌యానికి నిద్ర లేవ‌డం అల‌వాటు చేసుకోవాలి. నిద్రపోయే ముందు పొగ‌తాగ‌డం, మ‌ద్యం సేవించటం, కాఫీ, టీల‌ు తాగటం చేయకూడదు. పడుకునే రూము లో ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి దూరంగా ఉండ‌టంతో పాటు రోజుకు 30 నిమిషాల పాటు శారీర‌క వ్యాయామం చేయాలి. అలా చేస్తే సుఖ‌నిద్ర సొంత‌మ‌వుతుంద‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు.

సుఖ నిద్ర పడుతోంది అంటే ఒత్తిడి లేనట్లే. ఒత్తిడి ఉంటే సుఖ నిద్ర మాట ఎలా ఉన్నా అస్సలు నిద్రే పట్టదనే విషయం తెలిసిందే. సుఖ నిద్రకు మొద్దు నిద్రకు చాలా తేడా ఉంది. మొద్దు నిద్ర అంటే గంటల తరబడి పడుకోవటం. బద్దకంగా ఉన్నా..లేదా తినే ఆహారం హెవీగా ఉన్నా మొద్దు నిద్ర పట్టేస్తుంది. లేదా మద్యం తాగినా మొద్దు నిద్ర పడుతుంది.ఇది ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అనారోగ్యానికి గురిచేస్తుంది.కాబట్టి ప్రతి మనిషి సుఖ నిద్ర పట్టాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి.