కన్నీళ్లు తెప్పిస్తోంది : బిడ్డ కోసం ప్రాణ త్యాగం చేసిన ఏనుగు

కన్నీళ్లు తెప్పిస్తోంది : బిడ్డ కోసం ప్రాణ త్యాగం చేసిన ఏనుగు

Ganga elephant

Ganga elephant : ఆపదలో ఉన్న బిడ్డను రక్షించుకోనేందుకు సాహసమే చేసింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టింది. తన బిడ్డను కాపాడుకుంది. కానీ చివరకు ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. మనుషులు అని అనుకుంటున్నారా ? కాదు..అదో జంతువు. ఏనుగు చేసిన సాహసం నెటిజన్ల హృదయాలను కదిలించి వేస్తోంది. జీవ పరిరక్షణ శాస్త్రవేత్త నేహా సిన్హ తన ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది.

పశ్చిమ బెంగాల్ అటవీ ప్రాంతానికి చెందిన గంగా అనే ఏనుగు, దాని పిల్లను అవిజన్ సాహా అనే వ్యక్తి ఇటీవలే ఫొటో తీశాడు. గంగతో పాటు దాని మంద అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయి. వీటిని వెళ్లగొట్టేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకుంటూ వేరే ప్రాంతానికి వెళుతున్నాయి. మధ్యలో రైలు పట్టాలు ఎదురయ్యాయి. గంగ పిల్ల మాత్రం రైలు పట్టాలను దాటలేకపోయింది. ఇంతలో శబ్దం చేసుకుంటూ..ఓ రైలు వస్తోంది. ఇది చూసిన గంగ తీవ్ర ఆవేదనకు లోనైంది.

తన బిడ్డను కాపాడుకొనే ప్రయత్నం చేసింది. బిడ్డ పట్టాలు దాటేందుకు వీలుగా రైలుకు అడ్డంగా నిలిచి దానిని కాపాడింది. వేగంగా వచ్చిన రైలు గంగను ఢీకొంది. ఈ సమయంలో దాని బిడ్డ క్షేమంగా పట్టాలు దాటింది. కానీ..గంగ చనిపోయింది. మన కుటుంబాల కోసం చనిపోతామని మనం అంటుంటాం. అయితే ఏనుగులు వాస్తవంగా చేస్తాయి’ అని అందులో వ్యాఖ్యానించారు. కాగా, నేహా సిన్హా పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బిడ్డ కోసం ఏనుగు చేసిన సాహసం నెటిజన్లకు కన్నీళ్లు తెప్పించింది. ఇదొక హృదయ విదాకరమైన ఘటనగా అభివర్ణించారు. ‘రక్షించడంలో మనం విఫలమయ్యాం. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయడం లేదు. మనం కూడా మన గొంతును వినిపించలేకపోతున్నాం’ అని కామెంట్స్ చేస్తున్నారు.