ఆన్‌లైన్ హియరింగ్‌కు చొక్కా లేకుండా అటెండ్ అయిన అడ్వకేట్

ఆన్‌లైన్ హియరింగ్‌కు చొక్కా లేకుండా అటెండ్ అయిన అడ్వకేట్

సుదర్శన్ టీవీ కేసు విషయంలో జరుగుతున్న వాదనలో సోమవారం Advocate చొక్కా లేకుండా హాజరయ్యారు. ఈ ఘటనకు తనతో పాటు ఆన్‌లైన్ హియరింగ్‌కు
హాజరైన జడ్జిలు అంతా షాక్ అయ్యారు. జస్టిస్ డీవై చంద్రచుద్ అధ్యక్షతన బెంచ్‌ను ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.




జస్టిస్ చంద్రచుద్ మాత్రం తాను అలా ప్రవర్తించడానికి పూర్తి హక్కు ఉందని చెప్పుకొచ్చారు. బెంచ్‌లో ఒకరైన జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం విసుగు చెందడంతో పాటు క్షమించరానిదిగా పేర్కొన్నారు.
https://10tv.in/sbi-core-banking-system-impacted-by-connectivity-issues-atms-working/
మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి కోర్టులు కొద్ది నెలలుగా ఆన్‌లైన్ హియరింగ్‌లు కొనసాగిస్తున్నాయి. గతంలోనూ ఇలా ఒకసారి జరిగింది. సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ ఆన్‌లైన్ హియరింగ్‌లోనే స్మోకింగ్ చేస్తూ కనిపించాడు.

రాజస్థాన్ హైకోర్ట్ లాయర్ ఆన్‌లైన్ బెయిల్ హియరింగ్ జరుగుతున్న సమయంలో వెస్ట్ (బనియన్)తో కనిపించారు. ‘మహమ్మారి సమయంలో జరుగుతున్న ఆన్‌లైన్ హియరింగ్స్‌లో అడ్వకేట్లు సరైన యూనిఫాంలో కనిపించాలి’ అని కోర్టు వెల్లడించింది. అడ్వకేట్ల చట్ట ప్రకారం.. కోర్టు ముందు సూచించిన డ్రెస్ కోడ్‌ను మాత్రమే ధరించాలి.




గుజరాత్ హైకోర్టు ఆన్‌లైన్ హియరింగ్ లో స్మోకింగ్ చేస్తున్నందుకుగానూ.. రూ.10వేల పెనాల్టీ విధించింది.